Salman Khan: రద్దీ రోడ్డుపై ఆటో రిక్షా నడిపిన సల్మాన్‌ ఖాన్‌.. ఆశ్చర్యపోయిన జనాలు!! (వీడియో)

బాలీవుడ్ సీనియర్ హీరో సల్మాన్‌ ఖాన్‌ మంగళవారం (డిసెంబర్‌ 26) ముంబైలోని పన్వెల్‌లో రద్దీగా ఉన్న రోడ్లపై ఆటో రిక్షా నడిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2021, 07:52 PM IST
  • సల్మాన్‌ ఖాన్‌ మరో వీడియో వైరల్
  • ఆటో రిక్షా నడిపిన సల్మాన్‌ ఖాన్‌
  • మురిసిపోతున్న సల్మాన్‌ అభిమానులు
Salman Khan: రద్దీ రోడ్డుపై ఆటో రిక్షా నడిపిన సల్మాన్‌ ఖాన్‌.. ఆశ్చర్యపోయిన జనాలు!! (వీడియో)

 Salman Khan drives auto-rickshaw in Mumbai Panvel's roads: బాలీవుడ్ సీనియర్ హీరో, మోస్ట్ ఎలిజబుల్‌ బ్యాచ్‌లర్‌ సల్మాన్‌ ఖాన్‌.. సోమవారం (డిసెంబర్‌ 27) 56వ పడిలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా షూటింగ్‌లకు బ్రేక్ ఇచ్చి మరీ.. తన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముంబై (Mumbai)లోని తన ఫామ్ హౌస్‌లో సీనియర్ హీరోయిన్‌ జెనీలియా (Genelia D'Souza)తో సల్లూ భాయి డ్యాన్స్‌ చేసి అందరిని అలరించారు. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. తాజాగా సల్మాన్‌ ఖాన్‌కు సంబందించిన మరో వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 

సల్మాన్‌ ఖాన్‌ మంగళవారం (డిసెంబర్‌ 26) ముంబైలోని పన్వెల్‌ ( Panvel)లో రద్దీగా ఉన్న రోడ్లపై ఆటో రిక్షా (Auto-Rickshaw) నడిపారు. సరదాగా టీ తాగేందుకు పన్వెల్‌లో బయటకు వచ్చిన సల్లూ భాయికి రోడ్డు పక్కనే ఆటో రిక్షా కనపబడింది. అందులో ఉన్న డ్రైవర్‌ని దింపి ఆటోను నడిపారు. ఈ సమయంలో సల్మాన్‌ ఖాన్‌ టీషర్ట్, షాట్, క్యాప్ పెట్టుకుని ఉన్నారు. ఆటో రిక్షాను నడుపుతున్న సల్మాన్‌ ఖాన్‌ను చూసిన అక్కడి ఫాన్స్, జనాలు షాక్ అయ్యారు. కొందరు తమ మొబైల్స్ తీసి వీడియో షూట్ చేశారు. ఈ వీడియో ప‍్రస్తుతం నెట్టింట వైరల్ అయింది. వీడియో చూసిన సల్మాన్‌ అభిమానులు మురిసిపోతున్నారు.

Also Read: IND vs SA: చెలరేగిన రబాడ, జాన్సెన్.. భారత్‌ 174 ఆలౌట్! దక్షిణాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

 
 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Manav Manglani (@manav.manglani)

సల్మాన్‌ ఖాన్ (Salman Khan) తన బర్త్‌డేకు ముందున పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. పన్వేల్‌లోని ఫామ్‌ హౌస్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బర్త్‌డే కోసం ఏర్పాట్లు చేస్తుండగా అర్థరాత్రి దాటక అతని కాలుపై పాము కాటేసింది. దీంతో కండల వీరుడి వ్యక్తిగత సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. సల్మాన్‌ 6 గంటల తర్వాత డిశ్చార్జ్‌ అయ్యాడు. తర్వాత అది ప్రమాదకరమైన విష సర్పం కాదని సల్లూ భాయ్‌ తెలిపారు. ఆ తర్వాతి రోజే బర్త్‌డేను ఘనంగా జరుపుకున్నారు. సల్మాన్‌ చివరగా 'అంతిమ్‌: ద ఫైనల్‌ ట్రూత్‌' సినిమాలో కనిపించారు. ఇక టైగర్‌ 3 వచ్చే ఏడాది విడుదల కానుంది. 

Also Read: Shardul Thakur: థర్డ్ అంపైర్.. నిద్ర పోతున్నావా ఏంది! శార్దూల్ ఠాకూర్ వికెట్‌పై సోషల్ మీడియాలో దుమారం!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

  

Trending News