Har Ghar Tiranga: అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు హర్ ఘర్ తిరంగాలో షారుక్ ఖాన్

Har Ghar Tiranga: 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా కుటుంబంతో సహా స్వాతంత్య్ర వేడుకల సంబరాలు జరుపుకున్నారు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 14, 2022, 11:48 PM IST
Har Ghar Tiranga: అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు హర్ ఘర్ తిరంగాలో షారుక్ ఖాన్

Har Ghar Tiranga: 75వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో భాగంగా బాలీవుడ్ సెలెబ్రిటీలు హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తరువాత ఇప్పుడు షారుక్ ఖాన్ కూడా కుటుంబంతో సహా స్వాతంత్య్ర వేడుకల సంబరాలు జరుపుకున్నారు.

ఆగస్టు 15న దేశం మొత్తం 75 ఏళ్ల స్వాతంత్య్ర వేడుకల్ని జరుపుకోనుంది. ఈ క్రమంలో భారతదేశ ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా క్యాంపెయిన్ ప్రారంభించింది. ఈ కార్యక్రమం ద్వారా సామాన్యుడి నుంచి సెలెబ్రిటీ వరకూ అంతా తమ తమ ఇళ్లపై జెండా ఎగురవేసి..క్యాంపెయిన్ విస్తృతం చేయాలని పిలుపునిచ్చింది ప్రభుత్వం. ఈ క్రమంలో బాలీవుడ్‌కు చెందిన చాలామంది సెలెబ్రిటీలు ఇప్పటికే తమ ఇళ్లపై జెండా ఎగురవేశారు. ఇదే క్రమంగా ఇప్పుడు షారుక్ ఖాన్ సైతం తన ఇంటిపై కుటుంబంతో సహా జెండా ఎగురవేశారు. ఆ ఫోటో షేర్ చేశారు..

ప్రఖ్యాత ఇంటీరియర్ డిజైనర్, షారుక్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఎక్కౌంట్లో ఇంటిపై జెండా ఎగురవేసిన ఫోటో షేర్ చేశారు. మీ అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. 

ఈ ఫోటోలో ఎగురుతున్న మువ్వన్నెల జెండా ముందు షారుక్  ఖాన్, గౌరీఖాన్‌తో పాటు కుమారులు ఆర్యన్ ఖాన్, అబ్రామ్ కన్పిస్తున్నారు. ఈ నలుగురూ తెల్లటి అవుట్‌ఫిట్‌లో ఆకర్షణీయంగా కన్పిస్తున్నారు. గౌరీఖాన్ డెనిమ్ జీన్స్‌తో పాటు వైట్ కోట్ ధరించగా..షారుక్ ఖాన్, ఆర్యన్, అబ్రామ్‌లు వైట్ టీ షర్ట్స్ , డెనిమ్ జీన్స్ ధరించారు. 

అభిమాన నటుడు షారుక్ ఖాన్ హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఫోటో షేర్ చేయగానే..అభిమానులంతా భారీగా కామెంట్లు చేస్తున్నారు. షారుక్ ఖాన్ కంటే ముందు ఈ క్యాంపెయిన్‌లో అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, కార్తీక్ ఆర్యన్, అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. ప్రస్తుతం షారుక్ ఖాన్ తన అప్‌కమింగ్ సినిమా పఠాన్‌తో బిజీగా ఉన్నారు. 

Also read: Happy Independence Day: అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు, మీ స్నేహితులకు ఈ మెస్సేజ్‌లు పంపించండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News