Dhanteras 2022: ధన్‌తేరాస్ అనేది సంపద, శ్రేయస్సును సూచించే శుభప్రదమైన పండుగ. దీపావళికి పర్వదినానికి ముందు ధన్‌తేరస్‌ను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. ఈ సందర్భంగా బంగారం లేదా వెండి కొనడం చాలామంది తమకు అదృష్టంగా భావిస్తారు. ప్రతి ఏడాదిలానే.. ఈసారి కూడా ధన్‌తేరస్‌లో లక్షలాది మంది ఆభరణాలు కొనేందుకు సిద్ధమవుతున్నారు. అయితే చాలా మంది బంగారం కొనలా..? లేదా వెండి కొనలా..? అనే సందిగ్ధంలో ఉన్నారు. ఏది కొంటే తమకు లాభం చేకూరుతుందని సెర్చ్ చేస్తున్నారు.
ధన్‌తేరస్ రోజున ఎక్కువ మంది బంగారు లేదా వెండి నాణేలను కొనుగోలు చేస్తారు. కరోనా మహమ్మారి తర్వాత మొదలైన రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం వేగంగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. మరోవైపు స్టాక్ మార్కెట్ కూడా నిరంతరం ఓ రేంజ్‌లో ట్రేడవుతోంది.
మీరు బంగారం లేదా వెండి కొనుగోలు చేయలనుకున్నా.. ముందు మీ బడ్జెట్‌ను దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు దేనిపై పెట్టుబడి పెట్టినా.. భవిష్యత్‌లో కష్ట సమయాల్లో ఉపయోగపడే విధంగా ఉండాలి. గతేడాది నుంచి బంగారం, వెండి ధరలు పరిశీలిస్తే.. గోల్డ్ రేట్స్ స్వల్పంగా పెరిగాయి. మరోవైపు సిల్వర్ రేట్లు మాత్రం భారీగా దక్కిపోయాయి.
ప్రపంచంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా వడ్డీ రేట్లు పెరిగాయి. మరోవైపు గతేడాది ధన్‌తేరస్‌తో పోలిస్తే.. ఈసారికి బంగారం 6 శాతం పెరగగా.. వెండి ధరలు దాదాపు 17 శాతం తగ్గాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు వెండి ధరలు 13 శాతం తగ్గడం గమనార్హం.
బంగారం, వెండి విషయం పక్కన పెడితే.. ధన్‌తెరాస్ రోజున చీపుర్లు కొనడం అదృష్టమని చాలా మంది భావిస్తారు. ఈ రోజున చీపురు కొనడం వల్ల మీరు మీ ఇంటి నుంచి పేదరికాన్ని తొలగిస్తున్నారని, మీకు ఆర్థిక సమస్యలు ఉండవని సూచిస్తుందని చెబుతున్నారు. అంతేకాకుండా ఇత్తడి, వెండి, పాలరాతి లేదా చెక్కతో చేసిన దేవుళ్ల, దేవతల విగ్రహాలను కొనుగోలు చేయడానికి ఇది మంచి సమయమని నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: Roja Selvamani Marriage pic : రోజా పెళ్లి ఫోటో వైరల్.. నాడు నేడు.. సెల్వమణి బర్త్ డే స్పెషల్ పిక్
Also Read: AP Capital: మూడు రాజధానులపై వైసీపీ రాజీనామా స్కెచ్.. టీడీపీ కౌంటర్ ఏంటో?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook