Bollywood: బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ ఇండియా పర్యటన చర్చనీయాంశమైంది. దుబాయ్ నుంచి ఇండియాకు ఎందుకొచ్చారనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఇప్పుడు తిరిగి దుబాయ్ చేరుకున్నారు.
ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్(Sanjay Dutt)ఇండియా పర్యటనకు కారణాలేంటనే విషయంలో ఊహాగానాలు ఎక్కువయ్యాయి. కేన్సర్ బారిన పడిన సంజయ్ దత్ ఇటీవల లండన్ వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. కేన్సర్ నుంచి కోలుకున్నానని గత యేడాది అక్టోబర్ నెలలో స్వయంగా సంజయ్ దత్ ప్రకటించాడు కూడా. గత కొద్దికాలంగా భార్య మాన్యత, పిల్లలు షారాన్, ఇఖ్రాలతో కలిసి దుబాయ్‌లో ఉంటున్నాడు సంజయ్ దత్. అయితే పది రోజుల క్రితం హఠాత్తుగా భార్యాపిల్లల్ని దుబాయ్‌లోనే వదిలి ఒంటరిగా ముంబైకు వచ్చాడు. ముంబై పర్యటనలో భాగంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆయన భార్య కాంచన్ గడ్కరీలను నాగ్‌పూర్‌లో కలిశారు. ఇదే ఇప్పుడు ప్రశ్నార్ధకమైంది. సంజయ్ దత్ హఠాత్తుగా ముంబై పర్యటన చేపట్టడానికి కారణమేంటనే ప్రశ్నలు విన్పిస్తున్నాయి. నితిన్ గడ్కరీ(Nitin Gadkari)తో సమావేశం వెనుక మతలబు ఏమైనా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముంబై పర్యటన(Mumbai Tour) ముగించుకుని ఇప్పుడు తిరిగి దుబాయ్‌కు చేరుకున్నాడు.
సంజయ్ దత్ నెగెటివ్ రోల్లో కీలకంగా కన్పించనున్న కేజీఎఫ్ 2 (KGF-2)పై ఇప్పుడు భారీ అంచనాలున్నాయి. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా సంజయ్ దత్‌కు మంచి హిట్ ఇవ్వనుందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు పృధ్వీరాజ్, భుజ్ ది ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాల్లో కూడా సంజయ్ దత్ కన్పించనున్నాడు.
Also read: Ravi Teja's remuneration: క్రాక్ మూవీ సక్సెస్ తర్వాత రవితేజ పారితోషికం ఎంతో తెలుసా ?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook