Bomb threat to hero Vijay's home: హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు...

Bomb threat to hero Vijay's home: చెన్నైలోని హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసి విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 16, 2021, 02:59 PM IST
  • హీరో విజయ్ ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు కాల్
    ఫేక్ కాల్ అని తేల్చిన పోలీసులు
    ఓ మతిస్థిమితం లేని వ్యక్తి నుంచి ఆ ఫోన్ కాల్
Bomb threat to hero Vijay's home: హీరో విజయ్ ఇంటికి బాంబు బెదిరింపు...

Bomb threat to hero Vijay's home: తమిళ స్టార్ హీరో విజయ్ (Thalapathy Vijay) ఇంటికి మరోసారి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. చెన్నైలోని (Chennai) ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్లు సోమవారం (నవంబర్ 15) తెల్లవారుజామున గుర్తు తెలియని అగంతకుడు నగరంలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశాడు. దీంతో వెంటనే బాంబ్ స్క్వాడ్‌ టీమ్‌, డాగ్ స్క్వాడ్‌ విజయ్ ఇంటికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు. ఎక్కడా బాంబు లేకపోవడంతో బెదిరింపు ఫోన్ కాల్ ఫేక్ అని తేల్చారు.

విజయ్ (Vijay Joseph) మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆ ఫేక్ ఫోన్ కాల్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడిని విల్లుపురం జిల్లా మరక్కణంకి చెందిన భువనేశ్వర్‌ అనే వ్యక్తిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతను మతి స్థిమితం లేని వ్యక్తి అని... గతంలోనూ పలువురు సినీ ప్రముఖుల ఇళ్లల్లో బాంబులు పెట్టినట్లు బెదిరింపు కాల్స్ చేశాడని చెప్పారు.

ఈ ఏడాది జూన్‌లో తమిళ అగ్ర హీరో అజిత్ (Hero Ajith) ఇంటికి కూడా బాంబు బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. చెన్నైలోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కి ఫోన్ చేసిన ఓ అగంతకుడు అజిత్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెప్పాడు. దీంతో బాంబ్ స్క్వాడ్ టీమ్ హుటాహుటిన అజిత్ ఇంటికి చేరుకుని ఇల్లంతా తనిఖీలు చేశారు. అర్థరాత్రి వరకూ తనిఖీలు చేసినా ఎక్కడా ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు. దీంతో అది ఫేక్ బెదిరింపు కాల్‌గా నిర్దారించారు. ఫోన్ నంబర్ ఆధారంగా ఆ వ్యక్తి వివరాలు తెలుసుకోగా అతనో మానసిక వికలాంగుడని... అతని పేరు దినేశ్‌ అని గుర్తించారు. గతంలో ఇదే దినేశ్ రజనీకాంత్, విజయ్ ఇళ్లకు కూడా ఫేక్ బెదిరింపు కాల్స్ చేశాడు. దినేశ్‌కు మతిస్థిమితం సరిగా లేనందునా అతనికి సెల్‌ఫోన్ ఇవ్వొద్దని అతని తల్లిదండ్రులను పోలీసులు హెచ్చరించారు.

Also Read:Samantha Remuneration: 'పుష్ప'లో ఐటెం సాంగ్ కోసం రూ.1.5 కోట్లు తీసుకుంటున్న సమంత..?? 

ఇదిలా ఉంటే, ప్ర‌స్తుతం హీరో విజ‌య్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో బీస్ట్ (Beast) అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూజా హెగ్దే (Pooja Hegde) హీరోయిన్‌గా నటిస్తోంది. సినిమాలో విజయ్ ఆర్మీ ఆఫీస‌ర్‌ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమాకు అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News