Allu Arjun Row: సంధ్య థియేటర్ సంఘటన సమయంలో అల్లు అర్జున్ వెంట ఉన్న బౌన్సర్లతో తమకు సంబంధం లేదని బౌన్సర్ల సంఘం సంచలన ప్రకటన చేసింది. అనుమతి లేకుండా బౌన్సర్లుగా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. అనధికారిక సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలని బౌన్సర్ల సంఘం ప్రతినిధులు డిమాండ్ చేశారు. సంధ్య థియేటర్ వ్యవహారంలో అల్లు అర్జున్ తప్పిదం ఉందని ప్రకటించడం కలకలం రేపింది. గుర్తింపు లేని సంస్థల బౌన్సర్లను అల్లు అర్జున్ నియమించుకున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరోగా ఉన్న అల్లు అర్జున్ ఎందుకు అవహగానా లేకుండా చేశారని సందేహం వ్యక్తం చేశారు.
Also Read: Bandi Sanjay: తెలంగాణలో 14 శాతం కమీషన్ ఇస్తేనే పనులు.. బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు
అల్లు అర్జున్ సంధ్య థియేటర్ తొక్కిసలాటలో బౌన్సర్ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రంలో బౌన్సర్ల వ్యవస్థను రద్దు చేయాలని రేవంత్ రెడ్డి నిర్ణయించిన నేపథ్యంలో బౌన్సర్ల సంఘం కీలక సమావేశం నిర్వహించింది. బౌన్సర్ల వ్యవస్థకు సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అనే సంఘం ఉంది. హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఆ సంఘం ప్రతినిధులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో అల్లు అర్జున్‌ను తప్పుబట్టారు.
ఈ సందర్భంగా సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ మాట్లాడుతూ.. 'అనధికారికంగా కొనసాగుతున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలపై చర్యలు తీసుకోవాలి' అని విజ్ఞప్తి చేశారు. సుమారు 840 సెక్యూరిటీ ఏజెన్సీలు ఉండగా తమ అసోసియేషన్ పరిధిలో 200 ఏజెన్సీ ఉన్నాయని వివరించారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టానుసారంగా సెక్యూరిటీ సర్వీసెస్ అందిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనలో అల్లు అర్జున్ కోసం పనిచేసిన బౌన్సర్లకు తమకు సంబంధం లేదని సెక్యూరిటీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రణాళికా బద్దంగా జరగాల్సిన సెక్యూరిటీ సర్వీసెస్‌లను ఇష్టానుసారుగా నిర్వహించడంతోనే ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు. సెక్యూరిటీ ఏజెన్సీ వ్యవస్థపై నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించిన అంశాలపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించారు. ఎంతో కాలంగా ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థను క్రమబద్ధీకరిస్తూ ఒకే యూనిఫామ్‌ను ఆమోదించాలని కోరారు. గుర్తింపు లేకుండా కొనసాగుతున్న ఏజెన్సీలపై చర్యలు తీసుకోవడంతో పాటు వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ వ్యవస్థకు తోడ్పాటును ఇవ్వాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.