Brahmanandam-Kovai Sarala: కోవై సరళని బ్రహ్మానందం అలా పిలుస్తారా! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Brahmanandam: కోవై సరళ - బ్రహ్మానందం.. ఈ జంట పేరు వింటేనే తెలుగు ప్రేక్షకులకు నవ్వొస్తుంది. ఎన్ని బాధల్లో ఉన్న వీరిద్దరూ కలిసి నటించిన సినిమాలు చూస్తే చాలు.. ఆ బాధలన్నీ మర్చిపోతాం. అలాంటి వీరిద్దరి జంట గురించి ప్రస్తుతం ఒక వార్త అందరినీ తెగ ఆకట్టుకుంటుంది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 11, 2024, 09:55 PM IST
Brahmanandam-Kovai Sarala: కోవై సరళని బ్రహ్మానందం అలా పిలుస్తారా! తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..

Brahmanandam-Kovai Sarala: హీరో,  హీరోయిన్స్ కన్నా ఎక్కువగా పేరు తెచ్చుకున్న కమెడియన్స్ జంట బ్రహ్మానందం, కోవై సరళ. ఒకప్పుడు వీరిద్దరి కోసమే సినిమాకెళ్లేవారు ఎంతోమంది. ముఖ్యంగా క్షేమంగా వెళ్లి లాభంగా రండి, తిరుమల తిరుపతి వెంకటేశా లాంటి సినిమాలలో వీరిద్దరి జంట.. ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఎన్ని బాధల్లో ఉన్నా చాలా వీరిద్దరిని చూస్తే వెంటనే నవ్వు మన పెదాలపై వస్తుంది. అంతటి క్రేజ్ వీరిద్దరి సొంతం. ఎన్నో సినిమాలలో కలిసి నటించిన వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. ఈ క్రమంలో కోవై సరళ తనను బ్రహ్మానందం ఏమని పిలుస్తారో చెప్పి అందరి దృష్టిని ఆకట్టుకుంది.

తాజాగా కోవై సరళ ఈటీవీలో ప్రచారమయ్యే అలీతో సరదాగా పాల్గొనగా.. ఇందులో తనకు బ్రహ్మానందంతో ఉన్న అనుబంధం గురించి తెలిపింది. కోవై సరళ మాట్లాడుతూ.. ‘బ్రహ్మానందం గారంటే నాకెంతో గౌరవం.  ఆయన నాకు అన్న, తండ్రిలా సలహాలిచ్చేవారు. ఆనందం గారితో కలిసి చాలా సినిమాలు చేశాను. ఆయన నాతో ఎప్పుడైనా మాట్లాడితే.. సరళా చెల్లి ఏం చేస్తున్నావు, కొంచెం డబ్బులు దాచుకో, అవసరానికి పనికొస్తాయి. నీకు ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నేనుంటాను అంటారు. ఆయన అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం’ అని చెప్పుకొచ్చింది.

అయితే ఎన్నో సినిమాలలో భార్యాభర్తలుగా కనిపించారు బ్రహ్మానందం, కోవై సరళ. అలాంటిది బ్రహ్మానందం కోవై సరళ అని చెల్లెలు అని పిలుస్తారు అని తెలిసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. అయినా బ్రహ్మానందంతో ఉండే తీరని చూసి అభినందిస్తున్నారు.  మొత్తం పైన కోవై సరళ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Also Read: పవన్ కళ్యాణ్ కి మద్దతు.. వైసిపి పార్టీకి సపోర్ట్.. అల్లు అర్జున్ వింత తీరు

Also Read: Motorola: కళ్లు చెదిరే ఫీచర్స్‌తో Motorola Edge 50 Fusion మొబైల్‌ వచ్చేస్తోంది.. ఫీచర్స్‌ ఇవే చూడండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News