Shilpa Shetty-Raj Kundra: శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్‌కుంద్రాపై చీటింగ్ కేసు నమోదైంది. ఓ బిజినెస్‌మెన్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు... వీరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 14, 2021, 03:25 PM IST
Shilpa Shetty-Raj Kundra: శిల్పాశెట్టి-రాజ్‌కుంద్రా దంపతులపై చీటింగ్‌ కేసు నమోదు

Shilpa Shetty-Raj Kundra: బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి(Shilpa Shetty), ఆమె భర్త రాజ్‌కుంద్రా మరో వివాదంలో చిక్కుకున్నారు. వారిపై చీటింగ్‌ కేసు నమోదైంది. ముంబయికి చెందిన నితిన్​ బరాయ్​ అనే వ్యాపారవేత్త వీరిద్దరిపై ఫిర్యాదు చేశారు.

శిల్పాశెట్టి, రాజ్​కుంద్రా(Raj Kundra) ప్రారంభించిన ఫిట్​నెస్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం దేశవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారుల నుంచి ఈ జంట డబ్బులు తీసుకున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. ఇందులో భాగంగా తన దగ్గర నుంచి రూ.కోటి 51లక్షలు తీసుకున్నారని.. అవి తిరిగి ఇవ్వాలని అడిగితే తనను బెదరిస్తున్నారని సదరు వ్యాపారవేత్త ఫిర్యాదులో పేర్కొన్నారు. 

Also Read: Puneeth Raj Kumar: అటవీ అధికారుల అభిమానం...ఏనుగుకు పునీత్‌ రాజ్‌కుమార్‌ పేరు!

2014లో ఎస్​ఎఫ్​ఎల్​ ఫిట్​నెస్​ కంపెనీ డైరెక్టర్​ కాషిఫ్​ కాన్​, శిల్పాశెట్టి, రాజ్​కుంద్రాతో పాటు ఇతరులు తమ సంస్థలో రూ.1.51కోట్లు పెట్టుబడి పెట్టాలని తనను కోరినట్లు తెలిపారు నితిన్. ఎస్​ఎఫ్​ఎల్​ ఫిట్​నెస్​ కంపెనీ(SFL Fitness Pvt Ltd) తనకు ఫ్రాంచైజీ కేటాయిస్తుందని.. పుణెలోని హడప్సర్​, కోరేగాన్​లలో జిమ్​, స్పా తెరుస్తుందని తనకు హామీ ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అయితే అది కార్యరూపం దాల్చలేదని, అందుకే తన డబ్బు తిరిగి ఇవ్వాలని కోరితే వారు బెదరింపులకు పాల్పడుతున్నారని వెల్లడించారు. పోర్నోగ్రఫీ కేసులో జులైలో అరెస్టైన రాజ్‌కుంద్రా..సెప్టెంబర్‌లో బెయిల్‌పై విడుదలయ్యారు. మళ్లీ ఇంతలోనే ఈ దంపతులపై చీటింగ్‌ కేసు నమోదవడం విశేషం.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News