ప్రముఖ టాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు..!

భద్రాచలం, వైశాలి, చందమామ, శ్రీరామచంద్రులు, సిద్ధం, త్రినేత్రం, ఆడంతే అదో టైపు లాంటి తెలుగు చిత్రాలలో నటించిన నటి సింధు మీనన్. 

Last Updated : Mar 10, 2018, 05:57 PM IST
ప్రముఖ టాలీవుడ్ నటిపై ఛీటింగ్ కేసు..!

భద్రాచలం, వైశాలి, చందమామ, శ్రీరామచంద్రులు, సిద్ధం, త్రినేత్రం, ఆడంతే అదో టైపు లాంటి తెలుగు చిత్రాలలో నటించిన నటి సింధు మీనన్. ఆమెపై బెంగళూరులో ఛీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. బ్యాంకు ఆఫ్ బరోడా బ్యాంకులో నకిలీ పత్రాలు సమర్పించి రూ.30 లక్షల రూపాయలను ఆమె, ఆమె సోదరుడు రుణంగా పొందారని తమ దర్యాప్తులో తేలడం వల్ల.. బ్యాంకు అధికారులు స్థానిక పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారని సమాచారం.

ఈ సందర్భంగా సింధుమీనన్‌తో పాటు ఆమె సోదరుడిపై ఛీటింగ్ కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో మూడో నిందితురాలిగా పేర్కొంటూ సింధు మీనన్‌ను విచారణకు హాజరు కావాల్సిందిగా తెలిపారు. అయితే ప్రస్తుతం సింధు మీనన్ అమెరికాలో ఉండడంతో ఆమెకు ఈ సమాచారం చేరిందో లేదో తెలియదు. సింధు మీనన్ తెలుగుతో పాటు తమిళం, మలయాళం చిత్రాల్లో కూడా నటించడం గమనార్హం.

Trending News