Game Changer: సంక్రాంతి రేస్ నుంచి స్టార్ హీరో సినిమా అవుట్.. రామ్ చరణ్ కి లైన్ క్లియర్..!

Sankranti Race 2025: సంక్రాంతి సందర్భంగా అజిత్ కుమార్ హీరోగా నటించిన గుడ్ బాడ్ అగ్లీ సినిమా విడుదలవుతుంది అని అధికారిక ప్రకటన వచ్చి చాలా కాలం అయింది. అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను చూస్తూ ఉంటే ఈ సినిమా ఖచ్చితంగా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.

Written by - Vishnupriya | Last Updated : Nov 26, 2024, 10:33 AM IST
Game Changer: సంక్రాంతి రేస్ నుంచి స్టార్ హీరో సినిమా అవుట్.. రామ్ చరణ్ కి లైన్ క్లియర్..!

Good Bad Ugly New Release Date: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ హీరోగా నటిస్తున్న సినిమా గుడ్ బాడ్ అగ్లీ. అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుంది అని చిత్ర బృందం ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తూ ఉంటే సినిమా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. 

Add Zee News as a Preferred Source

ఈ సినిమాని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. తాజాగా చెన్నైలో జరిగిన పుష్ప 2 వైల్డ్ ఫైర్ ఈవెంట్లో భాగంగా మాట్లాడుతూ.. మైత్రి మూవీ మేకర్స్ కి చెందిన నిర్మాత నవీన్ యెర్నేని గుడ్ బాడ్ అగ్లీ సినిమాకి సంబంధించిన విషయాలు కూడా బయటపెట్టారు. ఈ వేడుకలో మాట్లాడుతూ గుడ్ బాడ్ అగ్లీ సినిమా షూటింగ్ పూర్తవడానికి ఇంకా ఏడు రోజులు సమయం పడుతుంది అని.. విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు.

దీంతో సినిమా అనుకున్న తేదీకి కాకుండా వాయిదా పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ ఇంకా పూర్తవ్వలేదు అనే మాత్రమే కాక.. సినిమా వాయిదా వేయడానికి మరొక కారణం కూడా ఉంది అని తెలుస్తోంది. గుడ్ బాడ్ అగ్లీ సినిమా వాయిదా పడడం వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో విడుదల కావాలి కానీ.. వచ్చే ఏడాది సంక్రాంతికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మధ్య శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా జనవరి 10న విడుదల కాబోతోంది. ఈ సినిమా కోసమే మెగాస్టార్ చిరంజీవి తన విశ్వంభర సినిమా విడుదలని కూడా వాయిదా వేశారు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి గుడ్ బాడ్ అగ్లీ నిర్మాతలని కూడా తమ సినిమాని వాయిదా వేయమని కోరినట్లు తెలుస్తోంది. 

ఎంతైనా గేమ్ చేంజర్ ప్యాన్ ఇండియా సినిమా కాబట్టి.. సోలో రిలీజ్ ఉంటే బాగుంటుంది అని అనుకున్న చిరంజీవి కాంపిటేషన్ తగ్గించడం కోసం మైత్రి మూవీ మేకర్స్ వారిని కోరగా.. వారు కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అందుకే గుడ్ బాడ్ అగ్లీ సినిమా వాయిదా పడబోతున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాకి సంబంధించిన కొత్త విడుదల తేదీ ఎప్పుడు బయటకు వస్తుందో వేచి చూడాలి.

ఇది చదవండి: IPL Mega Auction 2025 Live Updates: ఐపీఎల్ చరిత్రలో అత్యధిక రేటు.. అన్ని రికార్డులు బద్దలు కొట్టిన శ్రేయాస్ అయ్యర్‌

ఇది చదవండి: Ind vs Aus: ఆసీస్‌పై భారీ ఆధిక్యంతో ఇండియా, 38 ఏళ్ల రికార్డ్ బ్రేక్ చేసిన రాహుల్-యశస్వి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

Vishnupriya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.

...Read More

Trending News