Rajamouli Brother Kaanchi Interesting Comments on Ponniyan Selvan: ప్రభాస్ హీరోగా నటించిన ఆదిపురుష్ టీజర్ను అయోధ్య వేదికగా సినిమా యూనిట్ ఘనంగా లాంచ్ చేసింది. ఈ సినిమా హీరో ప్రభాస్, హీరోయిన్ కృతి సనన్, దర్శకుడు ఓం రౌత్ వంటి వారు అయోధ్యకు వెళ్లి శ్రీరాముడిని దర్శించుకుని సరయు నది ఒడ్డున ఏర్పాటు చేసిన భారీ వేదిక ద్వారా ఈ టీజర్ రిలీజ్ చేశారు. అయితే టీజర్ చూసిన కొంత మంది తమ రోమాలు నిక్కబొడుచుకున్నాయి అని అంటుంటే మరి కొందరు మాత్రం కార్టూన్లతో సినిమా చేశారేంటి? కచ్చితంగా ఇది ఏదో తేడాగా ఉంది అంటూ ట్రోల్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
అయితే ఇప్పటి వరకు దాదాపు సెలబ్రిటీలు ఎవరూ ఈ విషయం మీద నెగిటివ్ గా స్పందించిన దాఖలాలు లేవు. కానీ రాజమౌళి సోదరుడు నటుడు, రచయిత అయిన శివశ్రీ కాంచి ఈ విషయం మీద ఆసక్తికరంగా స్పందించారు. తన ట్విట్టర్ అకౌంట్ వేదికగా ఆయన పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి అంటూ కామెంట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఎందుకంటే ప్రభాస్ ఆది పురుష్ టీజర్ ఏ మాత్రం ఆకట్టుకోలేదని చాలామంది చెబుతున్నారు. కానీ ఈ సందర్భంగా సినీ ప్రముఖులు కానీ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు కానీ ఈ విషయం మీద బాహాటంగా స్పందించిన దాఖలాలు లేవు. కానీ శివశ్రీ కాంచి ఇప్పుడు పౌరాణికం తీస్తే తెలుగోడే తీయాలి అంటూ పరోక్షంగా కామెంట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక శివ శివశ్రీ కాంచి చేసిన ట్వీట్ కి కూడా పలువురు భిన్నంగా స్పందిస్తున్నారు.
Rajamouli Brother Kaanchi Interesting Comments on Adipurush Teaser: తెలుగు సినిమా పురాణాలకు తెలుగు వాళ్లు చేసినంత డామేజ్ బహుశా వేరే వాళ్ళు చేయలేదేమో అని ఒకరు కామెంట్ చేస్తే ఆయనకు కాంచి కౌంటర్ ఇచ్చారు. మీరు ఇంకా బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే ఉన్నారేమో నేను గ్రే రోజుల్లో బతుకుతున్నానని చెప్పుకొచ్చారు. మరొక నెటిజెన్ హిందీ స్టార్ ప్లస్ లో వచ్చిన మహాభారతం, రామాయణం కొన్నేళ్ల క్రితమే భారతదేశం మొత్తం అందరూ మళ్లీమళ్లీ చూసేలా తీశారు కదండీ అదేంటో మరి హిందీ వాళ్ళు తీసినా ఇప్పటికీ తెగ చూస్తూనే ఉంటారు మన తెలుగు వాళ్ళతో సహా అంటూ కౌంటర్ ఇవ్వడంతో వేరే వాళ్ళు తీస్తే చూడరని, చూడలేదని అర్థం వచ్చేలా నా ప్రకటన ఉందా అండి అంటూ ప్రశ్నించారు.
అంటే లేదండి తెలుగు వాడే తీయాలి అన్నందుకు నాకే సందేహం కలిగింది అంటే తెలుగు వాళ్ళు కూడా అప్పట్లో బాగానే చూశారు కదా అనిపించింది అంటూ ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మొత్తం మీద శివశ్రీ కాంచి కామెంట్లను బట్టి చూస్తే ఆయనకు ఆది పురుష్ టీజర్ ఏమాత్రం నచ్చినట్లుగా కనిపించడం లేదు. అయితే అంతకు ముందు “భశుం” ఇంత కంగాళీ సినిమా నా జన్మ లో చూడలేదు… అప్పుడెప్పుడో చదివిన బాపూ గారి కార్టూను, అంటూ మరో ట్వీట్ చేయడంతో ఆయన కామెంట్ చేసింది పొన్నియన్ సెల్వన్ సినిమా గురించా అనే చర్చ కూడా జరుగుతోంది. ఆయన ఆదిపురుష్ టీజర్ గురించి కామెంట్ చేశారా? లేక పొన్నియన్ సెల్వం సినిమా గురించి కామెంట్ చేశారా అనేది ఆయన స్వయంగా క్లారిటీ ఇస్తే కానీ చెప్పలేం.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook