Chiranjeevi : రంగమార్తాండపై చిరు ప్రశంసలు.. త్రివేణి సంగమం అంటూ మెగాస్టార్ ట్వీట్

Chiranjeevi Praises Rangamarthanda చిరంజీవి తాజాగా రంగమార్తాండ సినిమాను వీక్షించాడట. సినిమాను చూసి బ్రహ్మానందం, ప్రకాష్‌ రాజ్‌ నటనకు ముగ్దుడయ్యాడట. చిరంజీవి తన భావాన్ని అంతా సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 25, 2023, 11:02 AM IST
  • థియేటర్లోకి వచ్చిన రంగమార్తాండ
  • చిరుని కదిలిసి కృష్ణవంశీ సినిమా
  • బ్రహ్మానందం నటకు చిరు ఫిదా
Chiranjeevi : రంగమార్తాండపై చిరు ప్రశంసలు.. త్రివేణి సంగమం అంటూ మెగాస్టార్ ట్వీట్

Chiranjeevi Praises Rangamarthanda రంగమార్తాండ సినిమాను చిరంజీవి వీక్షించాడు. అనంతరం సినిమా గురించి, నటీనటుల నటన గురించి చెబుతూ ట్వీట్ వేశాడు. 'రంగమార్తాండ చూశాను.. ఈ మధ్యకాలంలో చూసిన గొప్ప సినిమా ఇదే.. ప్రతీ ఆర్టిస్ట్‌కి తన జీవితాన్నే కళ్ల ముందు చూస్తున్నట్టనిపిస్తుంది. అలాగే ఈ చిత్రం ఓ త్రివేణి సంగమంలా అనిపించింది. కృష్ణవంశీ లాంటి ఓ క్రియేటివ్ డైరెక్టర్, ప్రకాష్‌ రాజ్ లాంటి జాతీయ ఉత్తమ నటుడు, ఒక హాస్య బ్రహ్మానందంల కలయిక, వారి పనితనం, ముఖ్యంగా ఆ ఇద్దరూ అద్భుతమైన నటుల నటన ఎంత భావోద్వేగానికి గురి చేసింది.

బ్రహ్మానందం ఇంత ఇంటెన్సిటీ ఉన్న ఓ అనూహ్యమైన పాత్రని చేయటం తొలిసారి. సెకండ్ హాఫ్ మొత్తం అప్రయత్నంగానే కంటతడి నిండింది. ఓ కంప్లీట్ ఎమోషనల్ జర్నీ అయిన ఇలాంటి చిత్రాలు అందరూ చూసి ఆదరించవలసినవి. ఇలాంటి రసవత్తరమైన చిత్రం తీసిన కృష్ణవంశీకి, ప్రకాష్‌ రాజ్‌కి, రమ్యకృష్ణకి చిత్రయూనిట్ అందరికీ అభినందనలు' అని చిరు ప్రశంసించాడు.

 

రంగమార్తాండ సినిమా అనేది మరాఠిలో వచ్చిన నటసామ్రాట్ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అక్కడ నానాపటేకర్ నటించిన పాత్రనే ఇక్కడ ప్రకాష్‌ రాజ్ పోషించాడు. రంగమార్తాండ సినిమాను వీక్షించిన సెలెబ్రిటీలంతా కూడా పొగిడేస్తున్నారు. కానీ థియేటర్లో మాత్రం ఈ సినిమా అంతగా ప్రభావం చూపిస్తున్నట్టుగా అనిపించడం లేదు.

థియేటర్లో ఈ సినిమాను ఆశించినంత కలెక్షన్లు రావడం లేదని టాక్. అయితే ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చు, ఓటీటీలో వచ్చిన రేటుకు చాలా వ్యత్యాసం ఉందని, అక్కడే రెట్టింపు లాభాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. థియేటర్ కలెక్షన్లు అనేది బోనస్ అని టాక్. అయితే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చాక మరింతగా హాట్ టాపిక్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఈ సినిమాతో బ్రహ్మానందం అందరినీ ఏడిపిస్తాడు. ఈ సినిమా బ్రహ్మానందం నటనకు అవార్డు రావాల్సిందే. ఇన్నేళ్లుగా నవ్వించిన బ్రహ్మానందం ఒక్కసారిగా ఏడిపించడంతో అంతా కదిలిపోయారు. ఆయన నటనకు కంటతడి పెట్టాల్సిందే.

Also Read:  Manchu Manoj Vs Manchu Vishnu: రోడ్డున పడ్డ మంచు గౌరవం?.. ఇంటిపై దాడులు చేస్తాడు మంచు విష్ణు వీడియో షేర్ చేసిన మనోజ్

Also Read: Manchu Family Fighting : మంచు బ్రదర్స్ వివాదం.. రంగంలోకి మోహన్ బాబు?.. వెనక్కి తగ్గిన మనోజ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x