Waltair Veerayya Twitter Review : వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్స్ కేక అంతే

Waltair Veerayya Twitter Review వాల్తేరు వీరయ్య సినిమా ఇప్పుడు థియేటర్లోకి వచ్చింది. ఈ చిత్రం గురించి సోషల్ మీడియాలో చర్చలు నడుస్తున్నాయి. ఈ సినిమా షోలు ఇప్పటికే పలు చోట్ల పడ్డాయి. ఓవర్సీస్ నుంచి టాక్ కూడా బయటకు వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 13, 2023, 05:34 AM IST
  • నేడే థియేటర్లోకి వాల్తేరు వీరయ్య
  • మెగా మాస్ మేనియా షురూ
  • చిరంజీవికి ఈసారైనా హిట్ పడేనా?
Waltair Veerayya Twitter Review : వాల్తేరు వీరయ్య ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్స్ కేక అంతే

Waltair Veerayya Twitter Review మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య అతిపెద్ద డిజాస్టర్‌గా మిగిలింది. గాడ్ ఫాదర్ సినిమా నష్టాలను తెచ్చిపెట్టింది. అంతకు ముందు చేసిన సైరా కూడా భారీ నష్టాలను తెచ్చి పెట్టింది. అలా చిరంజీవికి ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడటం లేదు. మరి ఈ వాల్తేరు వీరయ్య అయినా కూడా చిరు స్థాయి హిట్ సాధిస్తుందా? లేదా? అన్నది చూడాలి. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉందో ట్విట్టర్ టాక్ ఎలా ఉందో చూద్దాం.

 

ఇప్పుడే యూకేలో షో చూశాను.. సినిమా అదిరిపోయింది.. విపరీతమైన హింస వల్ల రెండు కట్స్ పడ్డాయి.. అదొక్కటే నాకు నిరాశగా అనిపించింది.. సినిమా అదిరిపోయింది.. వింటేజ్ చిరంజీవిని చూసినట్టుగా అనిపించింది.. సెకండాఫ్‌లో బ్రదర్ సెంటిమెంట్ చించేశారు.. ఇంత గొప్పగా చిరంజీవిని చూపించిన బాబీకి థాంక్స్ అని ఓ నెటిజన్ ట్వీట్ పెట్టాడు.

 

ఫస్ట్ హాఫ్ అదిరిందని, కానీ రెండో భాగం మాత్రం బ్రదర్ సెంటిమెంట్ అంటూ రొటీన్‌గా చూపించారని కొందరు అంటున్నారు. సంధ్య థియేటర్లో బాబీ, మైత్రీ నిర్మాతలు, డీఎస్పీలు సినిమా చూస్తున్నారని, ఇంటర్వెల్‌లో అందరూ గోల గోల చేసి బాబీకి చప్పట్లు కొట్టేశారట.

 

చిరంజీవి అనే పేరు లేకపోతే ఫస్ట్ హాఫ్ వేస్ట్ అని ఓ నెటిజన్ అన్నాడు. ఇక మరో నెటిజన్ ఇలా ట్వీట్ పెట్టాడు. ఫస్ట్ హాఫ్ బ్లాక్ బస్టర్ అని, మెగాస్టార్ కామెడీ టైమింగ్, బాస్ పార్టీ సాంగ్, ఇంట్రడక్షన్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ మెంటల్  ఎక్కించాడు బాబీ అన్నా అంటూ మరో నెటిజన్ ట్వీట్ పెట్టేశాడు.

 

ఈ సంక్రాంతికి చిరుయే విన్నర్ అని, కమర్షియల్ ఎంటర్టైనర్ రేంజ్ ఎలా ఉంటదో బాస్ చూపిస్తడు.. ఆ కామెడీ టైమింగ్, డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ చూశాక.. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అనేది మళ్లీ మళ్లీ అనాల్సి వస్తుంది అని మరో నెటిజన్ కామెంట్ పెట్టేశాడు.

Also Read:  Veera Simha Reddy Review : వీర సింహా రెడ్డి రివ్యూ.. మెప్పించిన బాలయ్య, నొప్పించిన గోపీచంద్

Also Read: Veera Simha Reddy Twitter Review : వీర సింహా రెడ్డి ట్విట్టర్ స్టోరీ.. బోయపాటి కన్నా అరాచకం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News