అభిమానికి "చిరు" కానుక

  

Last Updated : Nov 11, 2017, 08:45 PM IST
అభిమానికి "చిరు" కానుక

టాలీవుడ్ చిత్రసీమలో తనకంటూ మెగా ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన నటుడు చిరంజీవి అనడంలో సందేహం లేదు. ఎప్పుడూ తమకు తోచిన శైలిలో ఆయనపై తమ అభిమానాన్ని పంచుకుంటూ ఉంటారు చిరు ఫ్యాన్స్. కొందరు సోషల్ మీడియాలో ఆయన స్కెచ్‌లు గీస్తూ అభిమానాన్ని పంచుకుంటే.. మరికొందరు ఆయన స్టైల్ ఇమిటేట్ చేస్తూ అభిమానాన్ని చూపిస్తారు. ఈ మధ్యకాలంలో  ఓ అభిమాని ఇంకాస్త ముందుకు వెళ్లి.. తన పెళ్లి మండపంలో స్వయాన చిరంజీవి ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ పెళ్లి కార్యక్రమం ఫేస్బుక్‌లో వీడియోగా బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో చూసిన చిరు ఆశ్యర్యపోయారు. తన అభిమానితో స్వయంగా మాట్లాడి ఇంటికి కూడా ఆహ్వానించారు.  కొత్త దంపతులతో కలిసి భోజనం చేసి.. వారికి కొత్తబట్టలు కానుకగా ఇచ్చి ఆశీర్వదించారు. చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ కూడా ఆ కొత్త దంపతులతో మాట్లాడారు. ‘రంగస్థలం 1985’ సెట్‌‌కి వారిని ఆహ్వానించి ముచ్చటించారు. 

Trending News