Daggubati Venkatesh Wife Neeraja Reddy Back Ground: మూవీ మొగల్ గా, శతాధిక చిత్రాల నిర్మాతగా పేరు తెచ్చుకున్న దగ్గుబాటి రామానాయుడు కుమారుల్లో ఒకరైన విక్టరీ వెంకటేష్ హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులలో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సంగతి తెలిసిందే. వెంకటేష్ కి టాలీవుడ్ లోని టాప్ హీరోలలో ఒకరిగా పేరు ఉండటమే కాదు ఫ్యామిలీ సినిమాల స్పెషలిస్ట్ గా కూడా పేరుంది. ఒకప్పుడు ఆయన సినిమాలు వస్తున్నాయంటే కచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కారణంగా అవి హిట్ అవుతాయని అందరూ నమ్మేవారు.
చాలా కాలం నుంచి సినీ పరిశ్రమలో ఉన్నప్పటికీ ఆయన గురించి ఒక్క గాసిప్ కానీ వివాదం కానీ వివాదాస్పద వ్యాఖ్యలు కానీ ఒక్కటి కూడా తెరమీదకు రాలేదు. ఇక వెంకటేష్ ఎంత సైలెంట్ గా ఉంటే వెంకటేష్ పర్సనల్ లైఫ్ గురించి విషయాలు బయటకు ఎలా వస్తాయి? చెప్పండి!. ఆయన భార్య గురించి కానీ ముగ్గురు పిల్లల గురించి కానీ అసలు ఎలాంటి వివరాలు దాదాపుగా ఆన్లైన్లో కూడా దొరకవు అనడంలో అతిశయోక్తి లేదు.
ఇక వెంకటేష్ ఫ్యామిలీ గురించి మాకు తెలిసిన కొన్ని విషయాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వెంకటేష్ భార్య పేరు నీరజా రెడ్డి కాగా వీరిది చిత్తూరు జిల్లాలోని మదనపల్లె. ఆమె తల్లిదండ్రులు వెంకటసుబ్బారెడ్డి, ఉషారాణి. వీరిది అప్పట్లోనే జమీందారీ కుటుంబం. వందలాది ఎకరాల భూమితో సహా రైస్ మిల్లులు, పలు ఫ్యాక్టరీలు కాకుండా అంగ అనేక రకాల వ్యాపారాలు కూడా ఉన్నాయి.
ఇదీ చదవండి: Venkatesh Affairs: వెంకటేష్ పవిత్రుడేమీ కాడు.. వారితో ఎఫైర్లు.. డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్!
ఇక అప్పట్లో వెంకటేష్ హీరోగా నిలదొక్కుకున్నాడని అర్థమైన తర్వాత పెళ్లి చేయాలని భావించిన రామానాయుడు తన సహ నిర్మాత అయిన విజయా సంస్థ అధినేత నాగిరెడ్డికి చెప్పడంతో నాగిరెడ్డి తమ ప్రాంతానికి చెందిన నీరజారెడ్డి కుటుంబం గురించి రామానాయుడు దృష్టికి తీసుకు వెళ్లారట. నాగిరెడ్డి ఈ సంబంధం ప్రస్తావన తీసుకురాగానే రామానాయుడు హుటాహుటిన మదనపల్లి వెళ్లి నీరజారెడ్డిని చూసి వచ్చారట. ఆమె కుటుంబం, ఆమె నచ్చడంతో వెంకటేష్ ను పిలిపించి చూపించి ఇద్దరూ ఒప్పుకున్న తర్వాత 1989లో అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు.
అయితే వెంకటేష్ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కానీ నీరజ రెడ్డి పేరులోనే రెడ్డి ఉండడంతో ఆమె రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తని అందరూ భావిస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆమెది కూడా కమ్మ సామాజిక వర్గమే. కానీ మదనపల్లెలోని ఆ ప్రాంత ప్రజలు ఏ కులానికి చెందిన వారైనా పేరు చివర రెడ్డి అని పెట్టుకోవడం కామన్ అని తెలుస్తోంది. ఆ ఊరి కొండపై ఉన్న రెడ్డమ్మ దేవత మీద నమ్మకంతో ఆమె మీద ఉన్న గౌరవంతో ఇలా రెడ్డి అని దాదాపు అందరూ పేర్ల చివర తగిలించుకుంటారట. ఇక నీరజారెడ్డి తల్లిది కృష్ణాజిల్లా కైకలూరు దగ్గరలో ఉన్న వరాహపట్నం అని చెబుతూ ఉంటారు.
నీరజారెడ్డి తల్లిది కూడా బాగా సంపన్నమైన కుటుంబం అట. ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం మదనపల్లెలో జరగగా ఆ తర్వాత కూడా పై చదువుల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి ఎంబీఏ వరకు చదువుకున్నారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నీరజారెడ్డి మేనమామ ఇంకెవరో కాదు ప్రస్తుతం బిజెపిలో ఉన్న కామినేని శ్రీనివాసరావు. ఆయన 2014లో బిజెపి తరఫున కైకలూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో ఆరోగ్య శాఖ మంత్రిగా సైతం పని చేశారు. వెంకటేష్ భార్య నీరజారెడ్డి బ్యాక్ గ్రౌండ్ చూస్తే మామూలుగా లేదనిపిస్తోంది కదూ. ఈ అంశంలో మీ ఉద్దేశం ఏంటో కింద కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Samantha Face: సమంతది ముసలి ముఖం.. ఆమె శకుంతల ఏంటి.. నటుడు షాకింగ్ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook