Love Mocktail 2 Review: ల‌వ్ మాక్‌టైల్ 2 రివ్యూ.. కన్నడ బ్లాక్‌బస్టర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..?

Love Mocktail 2 Movie Review and Rating: కన్నడ సూపర్ హిట్ మూవీ లవ్ మాక్‌టైల్-2 తెలుగులో రిలీజ్ అయింది. డార్లింగ్ కృష్ట హీరోగా నటిస్తూ.. దర్శకత్వం వహించి నిర్మించారు. కన్నడలో బ్లాక్‌హిస్టర్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను అలరించిందా..?    

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2024, 08:38 PM IST
Love Mocktail 2 Review: ల‌వ్ మాక్‌టైల్ 2 రివ్యూ.. కన్నడ బ్లాక్‌బస్టర్ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..?

Love Mocktail 2 Movie Review and Rating: కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘లవ్ మాక్‌టైల్ 2’ తెలుగులో వచ్చేసింది. డార్లింగ్ కృష్ణ హీరోగా నటించగా.. మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు డార్టింగ్ కృష్ణనే దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ సినిమాను కంచి కామాక్షి కోల్కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎంవీఆర్ కృష్ణ విడుదల చేశారు. ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ మంచి బజ్‌ను క్రియేట్ చేశాయి. గతంలో సూపర్ హిట్‌గా లవ్ మాక్‌టైల్‌ చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కింది. మరి తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా..? ఇక్కడ కూడా సూపర్‌ హిట్‌గా నిలిచిందా..? రివ్యూలో చూద్దాం పదండి..

కథ ఏంటంటే..?

లవ్ మాక్‌టైల్ సినిమాకు కంటిన్యూగా ఈ సినిమా కథ మొదలవుతంది. ఆది (డార్లింగ్ కృష్ణ) భార్య నిధి (మిలినా నాగరాజ్) మరణిస్తుంది. ఎప్పుడ తన భార్య ఆలోచనలతో ఆది పూర్తిగా డిప్రెషన్‌లోకి వెళ్లిపోతాడు. ఆ డిప్రెషన్ నుంచి బయటకు వచ్చేందుకు అరకు ట్రిప్‌కు వెళతాడు. ఈ క్రమంలో తన భార్య తనతో ఊహించుకుంటూ ఉంటాడు. తన వెంట అమ్మాయిలు పడినా.. వారిని పట్టించుకోడు. చివరికి ఆది మరో పెళ్లి చేసుకున్నాడా..? క్లైమాక్స్‌లో ఏం చేశాడు..? చివరకు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఎవరు ఎలా నటించారంటే..?

లవ్‌ మాక్‌టైల్ మూవీతో హిట్ అందుకున్న డార్లింగ్ కృష్ణ.. తానే నిర్మాతగా, డైరెక్టర్‌గా వ్యవహరించి హీరోగా నటిస్తూ ఈ సినిమాను తెరకెక్కించారు. ఎమోషన్ సీన్స్‌లో చాలా చక్కగా నటించాడు. నిధి పాత్రలో మిలిన నాగరాజ్ నటన ఆకట్టకుంది. రచల్ డేవిడ్, నకుల అభయాన్కర్, అమృత అయ్యంగర్, సుస్మిత గౌడ, అభిలాష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

ఈ చిత్రాన్ని ఎంవీఆర్ కృష్ణ తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. డబ్బింగ్ మూవీలా కాకుండా.. టెక్నికల్ వాల్యూస్‌ ఎక్కడా తగ్గకుండా డిజైన్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ నకుల అభయాన్కర్ అందించిన సంగీతం ప్లస్ పాయింట్. శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్ బాగుంది. ఫ్యామిలీ అంతా కూర్చొని చూసేవిధంగా డార్లింగ్ కృష్ణ రూపొందించారు.

ప్లస్ పాయింట్స్: డార్లింగ్ కృష్ణ స్టోరీ, యాక్టింగ్
==> నకుల్ అభయాన్కర్ సంగీతం
==> సెకండ్ హాఫ్, క్లైమాక్స్

మైనస్ పాయింట్స్: ప్రథమార్థంలో లాగ్ సీన్స్
==> కామెడీ

రేటింగ్ : 2.75/5

Also Read: Kalki 2898 AD: రిలీజ్ కు 15 రోజుల ముందే కల్కి మూవీ రికార్డు.. భారతీయ సినిమా చరిత్రలో ఫస్ట్ టైమ్..

Also Read: RK Roja CID: రోజా రూ.100 కోట్ల అక్రమాలు.. సీఐడీకి ఫిర్యాదుతో ఏపీలో కలకలం

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News