రణ్‌వీర్ సింగ్‌‌తో దీపికా పదుకునే పెళ్లి వాయిదా పడిందా ?

రణ్‌వీర్ సింగ్‌‌తో దీపికా పదుకునే పెళ్లి వాయిదా పడిందా ?

Last Updated : Oct 4, 2018, 05:04 PM IST
రణ్‌వీర్ సింగ్‌‌తో దీపికా పదుకునే పెళ్లి వాయిదా పడిందా ?

బాలీవుడ్‌లో గత కొంతకాలంగా దీపికా పదుకునే -  రణ్‌వీర్ సింగ్‌ల పెళ్లి ఓ ఆసక్తికరమైన అంశంగా మారింది. విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, సోనమ్ కపూర్-ఆనంద్ అహుజా, నేహా దూపియా-అంగడ్ బేడీ వంటి సెలబ్రిటీలు జోడీ కట్టిన తర్వాత వీళ్లిద్దరి పెళ్లిపైనే బాలీవుడ్ మొత్తం దృష్టీ కేంద్రీకరించింది. ఇప్పటికే చాలా సందర్భాల్లో వీళ్ల పెళ్లి వార్తలు పతాక శీర్షికలకెక్కాయి. వచ్చే నవంబర్ 11న వీళ్ల పెళ్లి జరగనున్నట్టు గతంలో పలు సందర్భాల్లో వార్తలొచ్చాయి. 

అయితే, తాజాగా బాలీవుడ్ మీడియా చెబుతున్న వివరాల ప్రకారం ఈ ఇద్దరి పెళ్లి మరోసారి వాయిదా పడినట్టు తెలుస్తోంది. అవును, 2019లోనే రణ్‌వీర్ సింగ్-దీపికా పదుకునెల పెళ్లి జరగనున్నట్టు తాజాగా బాలీవుడ్ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. ఇద్దరు అంగీకరించిన కమిట్‌మెంట్స్‌ని పూర్తి చేసిన తర్వాతే పెళ్లి ఆలోచన పెట్టుకోవాలని దీప్‌వీర్ జోడీ భావిస్తున్నట్టు సమాచారం. విచిత్రం ఏంటంటే, తామిద్దరం డేటింగ్‌లో ఉన్నామని ఆ జంట ఇప్పటివరకు ఎక్కడా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ.. వాళ్ల పెళ్లి వార్తలు మాత్రం ఎప్పటికప్పుడు పతాక శీర్షికలకు ఎక్కుతూనే ఉన్నాయి.
 

Trending News