Jr NTR for Mokshagna: ఇటీవలే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో.. నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. అయితే ఈ సంబరాలకు జూనియర్ ఎన్టీఆర్ కి.. ఆహ్వానం అందిందో లేక అంది కూడా ఆయన హాజరు కాలేదో తెలియదు కానీ.. ఈ ఉత్సవాలలో అయితే ఆయన కనిపించలేదు.
తన తల్లిని షాలినినీ తీసుకొని.. తన తల్లి సొంత ఊరు అయిన కుందాపూర్ కి వెళ్ళిపోయారు. బాలకృష్ణ స్వర్ణోత్సవ సంబరాలు ప్రారంభం కాకముందే కుందాపూర్ వెళ్లిన ఎన్టీఆర్, ఇక్కడ హైదరాబాదులో ఆ సంబరాలు పూర్తయిన మరుసటి రోజు వచ్చారు. దీంతో ఇప్పటికీ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంది.
ఇదిలా ఉండగా మరొకవైపు ఈవెంట్ కి హాజరు కాని జూనియర్ ఎన్టీఆర్.. మోక్షజ్ఞ మొదటి సినిమా లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యే అవకాశం ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 6వ తేదీన మోక్షజ్ఞ పుట్టిన రోజు. ఆ రోజే మోక్షజ్ఞ ప్రశాంత్ వర్మ కాంబో మూవీకి.. సంబంధించి క్రేజీ అప్డేట్ అధికారికంగా రాబోతోంది. అంతేకాదు ఆరోజే మోక్షజ్ఞ లాంచ్ ఈవెంట్ జరిగే అవకాశం కూడా ఉండగా, తారక్ ఈవెంట్ కి వస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మరి ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ వస్తారా? రారా? అనే క్లారిటీ కూడా మరో 2 రోజుల్లో తేలనుంది.
మరొకవైపు ఎన్టీఆర్ తాను ప్రకటించిన విరాళాన్ని సీఎం చంద్రబాబును కలిసి అందజేస్తారనే..ప్రచారం కూడా జరుగుతోంది. నిజంగానే ఇవన్నీ జరిగితే.. నందమూరి అభిమానులు తెగ సంబరపడిపోవడం ఖాయం.
ఇక మరొకవైపు ఎన్టీఆర్ ప్రముఖ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఇక దేవర హిందీ వెర్షన్ , తమిళ వెర్షన్లకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనే చర్చ కూడా సోషల్ మీడియా వేదికగా జరుగుతూ ఉండడం గమనార్హం. ఇక ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబో లో వస్తున్న దేవరా సినిమాతో బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ చేయడం పక్క అంటూ సోషల్ మీడియా వేదికగా వార్తలు వినిపిస్తున్నాయి.
మరి ఇన్ని రూమర్స్ మధ్య ఇందులో ఏ రూమర్ ని ఎన్టీఆర్ నిజం చేస్తారు అనే విషయాలు వైరల్ గా మారుతున్నాయి
Also Read: పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!
Also Read: పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడానికి కారణమేమిటంటే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.