NTR 30: 'పవన్' ప్రాపర్టీ మీద కన్నేసిన ఎన్టీఆర్.. అసలు సంగతి ఇదా?

Jr NTR on Pawan Kalyan Title: గతంలో ఒక హీరో చేయాల్సిన కధలు ఇతర హీరోలు చేయడం చూశాం కానీ ఇప్పుడు ఒక హీరో చేయాల్సిన సినిమా టైటిల్ ను మరో హీరో చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 30, 2023, 06:31 AM IST
NTR 30: 'పవన్' ప్రాపర్టీ మీద కన్నేసిన ఎన్టీఆర్.. అసలు సంగతి ఇదా?

'Devara' Title is in Consideration for NTR 30 : కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడం, ఆచార్య లాంటి డిజాస్టర్ తర్వాత కొరటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులందరికీ ఆసక్తి నెలకొంది. అయితే రాజమౌళితో చేసిన సినిమా తర్వాత ఏ హీరో ఏ సినిమా చేసినా అది డిజాస్టర్ అవుతుందని సెంటిమెంట్ అని బ్రేక్ చేసేందుకు అటు ఎన్టీఆర్, ఇటు కొరటాల శివ చాలా కష్టపడుతున్నారు.

ఈ సినిమాని ప్రస్తుతానికి ఎన్టీఆర్ 30 అనే పేరుతో సంబోధిస్తున్నారు. అనేక సార్లు వాయిదాలు పడిన తర్వాత ఎట్టకేలకు ఈ సినిమాని ఈ మధ్యనే అధికారికంగా లాంచ్ చేశారు. సినీ పెద్దల సమక్షంలో హైదరాబాదులో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కెమెరా ఆన్ చేయగా డైరెక్టర్ రాజమౌళి ఎన్టీఆర్ జాన్వి కపూర్ల తొలి ముహూర్తపు షాట్ కు క్లాప్ కొట్టి మరీ షూటింగ్ ప్రారంభించారు.

ఈ క్రమంలోనే అసలు సినిమా కథ ఏమిటి? ఎలా ఉండబోతుంది అనే విషయం మీద కూడా క్లారిటీ ఇచ్చేశారు కొరటాల శివ. కథ మాత్రమే కాదు ఎన్టీఆర్ లుక్స్ మీద కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆయన జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్ తో మళ్ళీ పని చేయడం సంతోషంగా ఉందని చెబుతూ ఇప్పటివరకు తాను చేసిన సినిమాలన్నింటి కంటే ఇది బెస్ట్ వర్క్ అవ్వబోతుందని చెప్పుకొచ్చారు. అంతేగాక ఈ కథ ఒక కోస్టల్ ల్యాండ్ నుంచి తీసుకున్నామని అక్కడ ఉండే మనుషులకు దేవుడంటే భయం లేదు, చావంటే భయం లేదు కానీ వాళ్లు మాత్రం ఒకదానికి మాత్రమే భయపడతారు అది ఎవరికి అనేది ఈ సినిమా నేపథ్యం అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చారు.

అయితే దేవుడంటే భయం లేదు అని చెబుతున్నారు కానీ ఈ సినిమాలో అక్కడి వారు భయపడేది దేవర అనే దేవుడికి అని అంటున్నారు. వాళ్ళందరూ దేవరగా భావించే ఒక దేవుడు అక్కడి కొండమీద ఉంటాడని తప్పు చేసిన వాళ్ళను కొండపై ఉండే దేవర శిక్షిస్తాడని అక్కడివాళ్లు ఆ దేవరకే భయపడతారు అన్నది సినిమా కథగా చెబుతున్నారు. బహుశా దేవుడి పేరుతో తప్పు చేసిన వారిని ఎన్టీఆర్ శిక్షిస్తారు ఏమో అనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది.

ఇక ఈ నేపద్యంలో ఈ సినిమాకి దేవర అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లుగా ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి ఈ దేవర అనే పదం పవన్ కళ్యాణ్ ను ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ సందర్భాల్లో కామెంట్లు కూడా చేశారు. అంతేకాదు తాను చేయబోతున్న సినిమాకి అదే టైటిల్ కూడా ఫిక్స్ చేస్తున్నానని గతంలో కామెంట్లు చేశారు. అయితే కొరటాల శివ ఈ దేవర టైటిల్ ని ఒకవేళ బండ్ల గణేష్ రిజిస్టర్ చేసుంటే ఆయన దగ్గర నుంచి తీసుకుంటారా? లేక కొండ కూడా కలిపేసి దేవరకొండ గా మార్చేస్తారా అనే విషయం మీద క్లారిటీ లేదు.

Also Read:  Dasara Twitter Review: దమ్ము చూపిస్తున్న దసరా... నాని కెరీర్ బెస్ట్.. ప్లస్సులు, మైనస్సులు ఇవే?

Also Read: Shreya Dhanwanthary: అన్ని హద్దులు చెరిపేసిన శ్రేయ ధన్వంతరి.. తెలుగమ్మాయి హాట్ షో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి  TwitterFacebook

 

More Stories

Trending News