Kannappa: కన్నప్ప మూవీ నుంచి మరో గూస్ బంప్స్ పోస్టర్.. అలరిస్తున్న దేవరాజ్ లుక్..!

Kannappa Update: కన్నప్ప సినిమా నుంచి విడుదల అవుతున్న ప్రమోషనల్ కంటెంట్..రోజురోజుకి ఈ చిత్రంపై అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి.. ఎంతోమంది సెలబ్రెటీస్ ఫస్ట్ లుక్ విడుదల.. అయ్యాయి. అవన్నీ కూడా ప్రేక్షకులను అలరిస్తూవచ్చాయి.   

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Aug 5, 2024, 04:33 PM IST
Kannappa: కన్నప్ప మూవీ నుంచి మరో గూస్ బంప్స్ పోస్టర్.. అలరిస్తున్న దేవరాజ్ లుక్..!

Kannappa Poster: హీరో మంచి విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న… ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ చిత్రంలో.. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీస్ భాగం కాగా.. వారి పోస్టర్స్ ఒక్కొక్కటిగా విడుదల చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా సోమవారం నాడు ఈ చిత్రం నుంచి మరొక సెలబ్రిటీ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

నాథనాధుడిగా శరత్ కుమార్, చెంచు తెగ నాయకురాలిగా పన్నాగా పోస్టర్స్ ఈ మధ్య విడుదల కాగా…ఈరోజు దేవరాజ్ పాత్రకు సంబంధించిన లుక్ పోస్టర్‌ను విడుదల.. చేశారు చిత్ర యూనిట్.

 ఈ సినిమాలో.. దేవరాజ్ ఎరుకల తెగకు  నాయకుడైన ‘ముండడు’ అనే పాత్రలో.. నటుడు దేవరాజ్ అద్భుతమైన లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ఈరోజు విడుదలై అందరిని మెప్పిస్తోంది. ఈ సినిమాలో మంచు విష్ణు తో పాటు.. ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, బ్రహ్మానందం, మధుబాల, కాజల్ వంటి వారు నటిస్తున్నారు. 

విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలోనే విరుదలై పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించనుంది. ఈ సినిమాలో శివుని భక్తుడైన కన్నప్ప గురించి ఎంతో గొప్పగా.. చెప్పనున్నారు. కన్నప్ప.. శివుడి పై ఉన్న ప్రేమ,‌ భక్తి తరతరాలుగా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉంది.  అలాంటి వ్యక్తి గురించి సినీ ప్రేక్షకులకు తెలియజేయడానికి..ఎంతో అంకితభావంతో విష్ణు మంచు ఈ పాత్రను పోషిస్తున్నారు.

Also Read: Nagarjuna Sagar: శ్రీశైలం నుంచి సాగర్ కు కొనసాగుతున్న వరద.. సాగర్ గేట్లు ఓపెన్..

Also Read: Nagarjuna Sagar: సగం నిండిన నాగార్జున సాగర్.. 2 లక్షల పైగా వరద..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News