Sir Movie Day 1: అంచనాలను మించిన 'సార్'..మొదటి రోజే ఆ రికార్డు బ్రేక్!

Sir Movie Day 1 Collections: ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం వాతి/సార్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది, ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 18, 2023, 10:02 AM IST
  • ప్రేక్షకులు మెప్పిస్తున్న సార్
  • మొదటి రోజే అంచనాలను మించి వసూళ్లు
  • మరింత పెరిగే అవకాశం
Sir Movie Day 1: అంచనాలను మించిన 'సార్'..మొదటి రోజే ఆ రికార్డు బ్రేక్!

Dhanush Sir Movie Day 1 Collections: ధనుష్ హీరోగా నటించిన ద్విభాషా చిత్రం వాతి/సార్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫిబ్రవరి 17 అంటే నిన్న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా అంతకన్నా ముందు ఒకరోజు ముందే రెండు తెలుగు రాష్ట్రాలలో కొన్ని ప్రీమియర్ స్పెషల్ షోస్ వేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ధనుష్ హీరోగా సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఈ సినిమా రూపొందింది. సముద్రఖని, సాయి కుమార్, హైపర్ ఆది, హరీష్ పేరడీ, ఆడుకాలం నవీన్ వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.

ఇక ఈ సినిమాని తమిళంలో వాతి పేరుతో రిలీజ్ చేయగా తెలుగులో సార్ పేరుతో రిలీజ్ చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద నాగ వంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమాకు త్రివిక్రమ్ భార్య సాయి సౌజన్య సహనిర్మాతగా వ్యవహరించారు. ఇక ఈ సినిమా ధనుష్ కెరియర్ లోనే తెలుగులో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలుస్తుందని తాజాగా నిన్న ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో సార్ సినిమా నిర్మాత నాగవంశీ ప్రకటించారు. అందుకు తగినట్లుగానే ఈ సినిమా మొదటి రోజే నాలుగు కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

వాస్తవానికి ధనుష్ కెరీర్ లో ఇప్పటి వరకు రఘువరన్ బీటెక్ సినిమాకి అత్యధిక వసూళ్లు తెలుగులో వచ్చాయి. ఆ సినిమా లాంగ్ రన్ లో నాలుగున్నర కోట్లు వసూలు చేస్తే ఈ సినిమా మొదటి రోజే నాలుగున్నర కోట్లు రాబట్టడం గమనార్హం. ఇక ఏరియాల వారీగా సార్ సినిమా ఎంత వసూలు చేసింది అనే వివరాల్లోకి వెళితే నైజాం ప్రాంతంలో కోటి 80 లక్షల గ్రాస్, ఉత్తరాంధ్ర ప్రాంతంలో 55 లక్షల గ్రాస్, ఈస్ట్ గోదావరి జిల్లాలో 45 లక్షల గ్రాస్, వెస్ట్ గోదావరి జిల్లాలో 19 అక్షరాల గ్రాస్, కృష్ణాజిల్లాలో 36 లక్షలు, గుంటూరు జిల్లాలో 42 లక్షలు, నెల్లూరు జిల్లాలో పాతిక లక్షలు వెరసి మొదటి రోజు 4.50 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టి ధనుష్ కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాగా నిలిచింది. ఇక తమిళ సినిమా వసూళ్లకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే ఇంకా అందాల్సి ఉంది.
Also Read: Shirley Setia Photos: బీచ్ ఒడ్డున పొట్టి గౌనులో రెచ్చిపోయిన తెలుగు హీరోయిన్

Also Read: Shalini Pandey Photos: క్లీవేజ్ ట్రీట్ తో రెచ్చిపోయిన షాలిని పాండే.. మాములు రచ్చ కాదుగా ఇది!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News