నేను ఎప్పుడూ శానిటరీ నాప్కిన్స్ వాడను

దియా మీర్జా.. ప్రముఖ బాలీవుడ్ నటి మరియు 2000లో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ సాధించిన సుందరీమణి. ఇటీవలే ఆమె భారతదేశం తరఫున ఐక్యరాజసమితికి పర్యావరణ పరిరక్షణ అంశాలను ప్రచారం చేసే గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎన్నికయ్యారు.

Last Updated : Dec 10, 2017, 05:54 PM IST
నేను ఎప్పుడూ శానిటరీ నాప్కిన్స్ వాడను

దియా మీర్జా.. ప్రముఖ బాలీవుడ్ నటి మరియు 2000లో మిస్ ఆసియా పసిఫిక్ టైటిల్ సాధించిన సుందరీమణి. ఇటీవలే ఆమె భారతదేశం తరఫున ఐక్యరాజసమితికి పర్యావరణ పరిరక్షణ అంశాలను ప్రచారం చేసే గుడ్ విల్ అంబాసిడర్‌గా ఎన్నికయ్యారు. తన నూతన బాధ్యతల్లో భాగంగా ఆమె పలు ఆలోచింపజేసే నిర్ణయాలు తీసుకున్నారు.

అందులో ఒకటే శానిటరీ నాప్కిన్స్ వాడకానికి స్వస్తి చెప్పడం. ఇదే విషయంపై దియా మాట్లాడుతూ "మహిళలకు శానిటరీ నాప్కిన్ అనేది ఎంత ముఖ్యమైన విషయమో తెలియంది కాదు. నెలసరి సమయంలో శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల వల్ల మహిళలకు శానిటరీ నాప్కిన్ అవసరం ఎంతో ఉంది. అయితే ఇలా వాడి పాడేసే శానిటరీ నాప్కిన్ల వల్ల, డైపర్ల వల్ల పర్యావరణానికి కలుగుతున్న నష్టం అంతా ఇంతా కాదు.

అందుకే నేను వీటిని వాడకూడదని నిర్ణయించుకున్నాను. వాటి బదులు కార్బన్ ఫుట్ ప్రింట్లు మిగల్చని బయోడీగ్రేడబుల్ నాప్కిన్లు మాత్రమే వాడాలని నిర్ణయించుకున్నాను. ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచనలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతో ఉంది" అని దియా మీర్జా తెలిపారు. శానిటరీ నాప్కిన్ల వల్ల దాదాపు ప్రతీ సంవత్సరం 9000 టన్నుల వేస్ట్ జనరేట్ అవుతోంది. శానిటరీ నాప్కిన్లతో పోల్చుకుంటే బయోడీగ్రేడబుల్ నాప్కిన్లు వేస్ట్‌గా మారాక.. వేగంగా అంతరించిపోతాయని దియా అభిప్రాయపడ్డారు. 

Trending News