Dil Raju: గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో దిల్ రాజు.. ఆ పాత్రలో కనిపించనున్నారా!

Geethanjali Malli Vachindi: అంజలి హీరోయిన్ గా చేసిన గీతాంజలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిత్రం రాబోతోంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2024, 11:04 AM IST
Dil Raju: గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమాలో దిల్ రాజు.. ఆ పాత్రలో కనిపించనున్నారా!

Dil Raju in Geethanjali Sequel: చిన్న సినిమాగా వచ్చి తెలుగు ఇండస్ట్రీలో పెద్ద విజయం సాధించిన చిత్రం గీతాంజలి. అంజలి హీరోయిన్ గా చేసిన ఈ హారర్ థ్రిల్లర్ అప్పట్లో మంచి విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రంకి సీక్వల్ గా గీతాంజలి మళ్లీ వచ్చింది అనే చిత్రం రాబోతోంది. ఈ సినిమా అంజలి నటిస్తున్న 50వ చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాలో నిర్మాత దిల్ రాజు ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు అనే వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు నిర్మిస్తూ అలానే డిస్ట్రిబ్యూట్ చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. కాగా మన తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు డైరెక్టర్స్, నిర్మాతలు సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ లు కనిపిస్తూ ఉండడం సహజమే. ఇదే ఫాలో అవుతూ నిర్మాత దిల్ రాజు కూడా గతంలో ఈ హారర్ కామెడీ సినిమా ‘గీతాంజలి’ లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఈ సినిమా సీక్వెల్ కోసం దిల్ రాజు వెండితెరపై కనపడబోతున్నారని సమాచారం.

 

గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా మార్చ్ 22న విడుదలకు సిద్ధంగా ఉంది. మొదటి పార్ట్ లో దిల్ రాజు గెస్ట్ అప్పీరెన్స్ ఇవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా రెండో భాగంలో కూడా దిల్ రాజుని ఈ చిత్ర మేకర్స్ గెస్ట్ అప్పీరెన్స్ కోసం అడిగినట్టు దానికి ఈ నిర్మాత ఒప్పుకున్నట్టు వినికిడి. దీంతో గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాలో దిల్ రాజు మరోసారి ఒక చిన్న పాత్రలో కనపడనున్నారు. 
 

ఇక నిర్మాతగా దిల్ రాజు నిర్మిస్తున్న సినిమాల విషయానికి రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో వస్తున్న గేమ్ ఛేంజర్ తో పాటు శతమానం భవతి సీక్వెల్ సినిమాలు మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు ఈ నిర్మాత. దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే మరో బ్యానర్ స్థాపించి పలు చిన్న సినిమాలు కూడా తీస్తున్నారు.

Also Read: Kuppam: చంద్రబాబును ఓడించండి.. కుప్పం అభివృద్ధి చేసుకుందాం: సీఎం జగన్‌ పిలుపు

Also Read: Floating Bridge: లేదు లేదు 'తేలియాడే వంతెన' కొట్టుకుపోలే.. మేమే దాన్ని విడదీశాం

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News