Dasara Teaser: దసరా టీజర్‌పై రాజమౌళి ట్వీట్.. కోతిలాగా గెంతుతున్నట్లు చెప్పిన డైరెక్టర్

SS Rajamouli Tweet On Nani Dasara Movie Teaser: నాని దసరా మూవీ టీజర్ దూసుకుపోతుంది. మాస్ లుక్‌లో నాని స్క్రీన్ ప్రెంజెటేషన్‌కు మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు. పోస్టర్లతోనే మూవీపై అంచనాలు ఏర్పడగా.. తాజాగా టీజర్‌తో రెట్టింపు అయ్యాయి. టీజర్‌ను చూసి రాజమౌలి మూవీ టీమ్‌ను అభినందించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 30, 2023, 07:49 PM IST
Dasara Teaser: దసరా టీజర్‌పై రాజమౌళి ట్వీట్.. కోతిలాగా గెంతుతున్నట్లు చెప్పిన డైరెక్టర్

SS Rajamouli Tweet On Nani Dasara Movie Teaser: నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్‌గా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ దసరా. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీని టీజర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. మొదటిసారిగా నాని రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించడంతో టీజర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అంచనాలకు తగ్గట్లే నాన్ ఊర మాస్ క్యారెక్టర్‌లో అదరగొట్టాడు. ఈ టీజర్ ఆద్యంతం ఒళ్ళు గగ్గురుపొడిచేలా సాగింది. సినిమాలో నాని గోదావరిఖని సింగరేణి గనుల్లో పనిచేసే ఒక కార్మికుడిగా కనిపిస్తుండగా.. ఆ గనుల నేపథ్యంలోనే కథ మొత్తం సాగినట్లుగా టీజర్ చూస్తే అర్థమవుతుంది. నిమిషం 15 సెకండ్ల పాటు సాగిన దసరా టీజర్ ఒక్కసారిగా సినిమా మీద అంచనాలను రెట్టింపు చేసింది. ఈ టీజర్‌ను అభిమానులకు తెగ షేర్ చేస్తుండగా.. అన్ని వైపులా నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.

స్టార్ డైరెక్టర్ రాజమౌళి దసరా టీజర్‌ను తెలుగులో రిలీజ్ చేశారు. అనంతరం మూవీ టీమ్‌ను ఆయన మెచ్చుకున్నారు. 'దసరా టీజర్  విజువల్స్ బాగా నచ్చాయి. నాని భారీ మేక్ఓవర్ ఆకట్టుకుంటుంది. ఒక కొత్త దర్శకుడు అలాంటి ప్రభావాన్ని సృష్టించడం చాలా బాగుంది. చివరి షాట్ అద్భుతం. అంతా మంచి జరగాలి..' అని ఆయర ట్వీట్ చేశారు.

ప్రపంచస్థాయి దర్శకుడు నుంచి ప్రశంసలు రావడంతో దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలా తెగ సంబరపడిపోతున్నాడు. 'సార్.. మీ ట్వీట్‌కు నా మైండ్ మొత్తం బ్లాక్ అయింది. మీకు ఇంగ్లిష్‌లో రిప్లై పెడదాం అనుకున్నా.. కానీ తెలుగులోనే మాటలు వస్తలేవు సార్. కోతి లెక్క గెంతుతున్నా.. చాలా ధన్యవాదాలు సార్..' అంటూ ఉత్సాహంతో ట్వీట్‌కు రిప్లై ఇచ్చాడు. 

 
తమిళ టీజర్‌ను విలక్షణ నటుడు ధనుష్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మాన్, హిందీ టీజర్‌ను షాహిద్ కపూర్లు రిలీజ్ చేశారు. తెలుగు సహా తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఒకేసారి మార్చినెలలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. 

టీజర్‌లో నాని చెప్పిన డైలాగ్స్ అభిమానులకు తెగ ఆకట్టుకుంటున్నాయి. మందంటే ఒక వ్యసనం కాదు ఇది మా ఆచారం అని అర్థం వచ్చేలా నాని చెప్పిన డైలాగ్ ఓ రేంజ్‌లో పెలుతోంది. ఈ సినిమాలో సముద్రఖని, దీక్షిత్ శెట్టి, షైన్ టామ్ చాకో వంటి ఇతర భాషలకు చెందిన నటీనటులు కూడా కీ రోల్స్ ప్లే చేశారు. అలాగే అలనాటి నటి జరినా వాహబ్, సాయి కుమార్ వంటి వారు ముఖ్యపాత్రలు పోషించారు. 

Also Read: CM Jagan Mohan Reddy: సీఎం జగన్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్.. అసలు కారణం ఇదే..

Also Read: Pawan Kalyan: పొత్తులపై పవన్ కళ్యాణ్ సందిగ్ధం.. జనసేన దారెటు..?  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News