Salman khan Arrest: లక్నో క్లాక్ టవర్ వద్ద సల్మాన్ ఖాన్ అరెస్టు, సెక్షన్ 151 నమోదు, ఎందుకంటే..

Salman khan Arrest: బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ అరెస్టయ్యాడు. బహిరంగ ప్రదేశాల్లో ప్రశాంతతకు భంగం కల్గించాడనే నేరంపై పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలివీ..

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 9, 2022, 06:38 PM IST
Salman khan Arrest: లక్నో క్లాక్ టవర్ వద్ద సల్మాన్ ఖాన్ అరెస్టు, సెక్షన్ 151 నమోదు, ఎందుకంటే..

Salman khan Arrest: బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ అరెస్టయ్యాడు. బహిరంగ ప్రదేశాల్లో ప్రశాంతతకు భంగం కల్గించాడనే నేరంపై పోలీసులు ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ వివరాలివీ..

నిజంగా బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్ అరెస్ట్ అనుకుంటున్నారా..ఇతని పేరు ఆజమ్ అన్సారీ. సల్మాన్ ఖాన్ డూప్లికేట్‌గా ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తుంటాడు. బహిరంగ ప్రదేశాల్లో శాంతికి విఘాతం కల్గించాడనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ పోలీసులు నిన్న డూప్లికేట్ సల్మాన్ ఖాన్‌ను అరెస్టు చేశారు. 

లక్నోలోని చారిత్రాత్మక క్లాక్ టవర్ వద్ద డూప్లికేట్ సల్మాన్ ఖాన్ ఓ షార్ట్ వీడియో తీస్తున్నాడు. నిన్న అంటే ఆదివారం రాత్రి షార్ట్ వీడియో షూటింగ్ సందర్భంగా డూప్లికేట్ సల్మాన్ ఖాన్‌ను చూసేందుకు భారీగా జనం గుమిగూడారు. ఫలితంగా విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్థానికంగా కొంతమంది ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఘటనా ప్రదేశానికి చేరుకున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించాడంటూ సెక్షన్ 151 కింద అన్సారీను లక్నో పోలీసులు అదుపులో తీసుకున్నారు. లక్నోలోని రోడ్లు, చారిత్రాత్మక ప్రదేశాల్లో అన్సారీ ఎక్కువగా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ షూట్ చేస్తుంటాడు. అతనికి యూట్యూబ్‌లో 1.67 లక్షల ఫాలోవర్లున్నారు.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Azam Ansari (@azam00ansari)

Also read: Iswarya Menon Hot Pics: ఐశ్వర్య మీనన్ స్లీవేజ్ షో.. అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News