Errachira The Beginning Glimpses: మదర్ సెంటిమెంట్, హార్రర్, యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో సుమన్ బాబు దర్శకత్వం వహిస్తూ కీలక పాత్రలో నటించిన మూవీ ఎర్రచీర-ది బిగినింగ్. శ్రీ పద్మాయల ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. నట కిరిటీ రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని కీలక పాత్రలో నటించగా.. శ్రీరామ్, కమల్ కామరాజు, కారుణ్య చౌదరి, అయ్యప్ప పీ శర్మ , సురేష్ కొండేటి, రఘుబాబు తదితరులు ఇతర పాత్రలు పోషించారు. డిసెంబర్ 20న ఆడియన్స్ ముందుకు రానుండగా.. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Also Read: Rahul Gandhi: నిజం చెబితే దేశాన్ని విభజించినట్టా మిస్టర్ మోదీజీ? రాహుల్ గాంధీ నిలదీత
ఈ సందర్భంగా దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. హారర్, దేవుడు కాన్సెప్ట్‌లతో ఈ మధ్య సినిమాల్లో ట్రెండ్‌గా మారిందని.. ఎర్రచీర-ది బిగినింగ్ మూవీ కూడా అదే ట్రెండ్‌లో వస్తుందని అనుకోవచ్చన్నారు. అయితే ఈ సినిమాను డిఫరెంట్ రూపొందించారని చెప్పారు. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించాలని కోరుకున్నారు. ఈ సినిమా దర్శక నిర్మాత, నటుడు సుమన్ బాబు మాట్లాడుతూ.. యాక్షన్, మదర్ సెంటిమెంట్‌తో ఈ చిత్రాన్ని తెరక్కెంచామని.. మూవీలో 22 పాత్రలతోపాటు చీర కూడా 23వ పాత్ర పోషిస్తుందన్నారు. ఈ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. బేబి సాయి తేజస్విని యాక్టింగ్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందన్నారు.
హీరోయిన్ కారుణ్య చౌదరి మట్లాడుతూ.. గ్లింప్స్‌లో హర హర మహాదేవా అనే డైలాగ్ చెప్పినప్పుడు గూస్ బంప్స్ వచ్చాయన్నారు. క్వాలిటీ మూవీ చేసేందకు తమ టీమ్ ఎంత కష్టపడ్డారో గ్లింప్స్ చూస్తే అర్థమవుతోందన్నారు. ఈ సినిమాలో బేబి సాయి తేజస్వినికి తనకు మధ్య మంచి బాండింగ్ ఉంటుందని.. మదర్ సెంటిమెంట్ ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పారు. ప్రేక్షకులు సపోర్ట్ చేయాలని కోరారు. నిర్మాత, నటుడు సురేష్ కొండేటి మాట్లాడుతూ.. ఈ సినిమా కథను సుమన్ బాబు చెప్పినప్పుడే చాలా బాగుందని అనిపించిందని.. తాను కూడా ఓ పాత్ర పోషించానని చెప్పారు. ప్రేక్షకులకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ కలిపి సుమన్ బాబు ఈ సినిమాను తెరకెక్కించారని చెప్పారు. ఈ మూవీ పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
టెక్నికల్ టీమ్
==> ఆర్ట్ - నాని, సుభాష్
==> స్టంట్స్ - నందు,
==> మాటలు - గోపి విమల పుత్ర,
==> సినిమాటోగ్రఫీ - చందు
==> ఎడిటర్ - వెంకట ప్రభు,
==> చీఫ్ కో డైరెక్టర్ - నవీన్ రామ నల్లం రెడ్డి,
==> BGM - ఎస్ చిన్న
==> సంగీతం - ప్రమోద్ పులిగార్ల
==> PRO- సురేష్ కొండేటి
==> నిర్మాత - ఎన్.వి.వి. సుబ్బారెడ్డి, సీహెచ్ వెంకట సుమన్
==> కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం- సుమన్ బాబు
Also Read: Rahul Gandhi: నిజం చెబితే దేశాన్ని విభజించినట్టా మిస్టర్ మోదీజీ? రాహుల్ గాంధీ నిలదీత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Errachira The Beginning: హర హర మహాదేవా.. అదిరిపోయిన ఎర్రచీర-ది బిగినింగ్ మూవీ గ్లింప్స్