Star Director Divorce: ఇండస్ట్రీకి మరో షాక్.. భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్

సినీ ఇండస్ట్రీలో విడాకుల పరంపర కొనసాగుతుంది, సమంత-నాగచైతన్య, ధనుష్- ఐశ్వర్య విడాకుల తరువాత ఇపుడు తమిళ స్టార్ డైరెక్టర్ బాల విడాకులు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 8, 2022, 12:56 PM IST
  • సమంత - నాగచైతన్య దారిలో డైరెక్టర్ బాల
  • భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్
  • విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు
Star Director Divorce: ఇండస్ట్రీకి మరో షాక్.. భార్యతో విడాకులు తీసుకున్న స్టార్ డైరెక్టర్

Star Director Bala Divorce: సినీ ఇండస్ట్రీలో సెలబ్రెటీల విడాకులు పరంపర కొనసాగుతూనే ఉంది. ఒకరి తరువాత ఒకరు సెలబ్రెటీలు విడాకులు తీసుకుంటున్నారు. సమంత- నాగచైతన్య విడాకులు యావత్ దేశంలో సంచలనం సృష్టించగా..తమిళ స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్య విడాకులు కూడా అభిమానులకు నిరాశకు గురి చేశాయి.. 

ఇక బాలీవుడ్ విషయానికి వస్తే స్టార్ హీరో అమీర్ ఖాన్ తన భార్య కిరణ్ రావుతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.  అలాగే బాలీవుడ్ ప్రముఖ సింగర్ హానీ సింగ్ తన భార్య షాలిని సింగ్ తో మనస్పర్థాల కారణంగా విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా మరో ప్రముఖ డైరెక్టర్ విడాకులు తీసుకోవటం సినీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తుంది. ఈ సారి విడాకులు తీసుకుంది ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ 'బాల'. ఇటీవలే భార్యతో విడాకుల కోసం కోర్టుకు వెళ్లగా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. డైరెక్టర్ బాల తమిళంలోనే కాకూండా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. బాల దర్శకత్వం వహించిన వాడు-వీడు, శేషు, శివపుత్రుడు వంటి సినిమాలు తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకున్నాయి. 

నిజానికి డైరెక్టర్ బాలకి ముత్తు మలర్ తో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. ఈ ఇద్దరికీ దంపతులకు ఒక పాప ఉండగా.. ఇద్దరి మధ్య విభేదాల కారణంగా నాలుగు సంవత్సరాల నుండి విడిగా ఉంటున్నారు. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. తాజగా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. 

Also Read: Rashmika Mandanna: రష్మిక మందన్న క్రేజ్ మాములుగా లేదుగా.. బాలీవుడ్ స్టార్ హీరోతో..!!

Also Read:Inter Hall Tickets: ఇంటర్మీడియట్ హాల్ టికెట్లు విడుదల, ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News