Nadiminti Narasinga Rao: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘గులాబి’ సినిమా రచయిత నడిమింటి నరసింగ రావు కన్నుమూత..

Nadiminti Narasinga Rao: చిత్రసీమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినిమా రచయత నడిమింటి నరసింగరావు ఇక లేరు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన యశోద ఆసుపత్రిలో కన్నుమూసారు.  ఈయన తెలుగులో పలు చిత్రాలకు కథలను అందించారు. ఆయన వయసు 72 యేళ్లు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Aug 28, 2024, 11:43 AM IST
Nadiminti Narasinga Rao: సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ‘గులాబి’  సినిమా రచయిత నడిమింటి నరసింగ రావు కన్నుమూత..

Nadiminti Narasinga Rao: తెలుగు చలన చిత్రసీమలో విషాదాల ఆగడం లేదు. తాజాగా ప్రముఖ సినీ రచయత కన్నుమూసారు. ఈయన  తెలుగులో కృష్ణవంశీ దర్శకత్వంలో  ‘గులాబి’, రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో  ‘అనగనగా ఒకరోజు’ వంటి సినిమాలకు కథలను అందించారు. దీంతో పాటు పలు విజయవంతమైన చిత్రాలకు కథతో పాటు కథా సహాకారం అందించారు. ఈయన వయసు 72 యేళ్లు. గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈయన బుధవారం హైదరాబాద్ యశోదా హాస్పిటల్ లో కన్నుమూసారు. అయితే.. ఈయన చనిపోయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అంతేకాదు గులాబి, అనగనగా ఒక రోజు సినిమాలకు కథతో పాటు మాటలు కూడా అందించారు. ఇందులోని డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయి. ఇప్పటికే యూ ట్యూబ్ లో ఆ డైలాగ్స్ కోసమే సినిమా చూసే వాళ్ళు ఉన్నారు. కొన్ని రోజుల క్రితం నరసింగరావు తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో ఫ్యామిలీ మెంబర్స్ ను ఈయన్ని హైదరాబాద్ లోని సోమాజిగూడ లోని  యశోదా ఆస్పత్రి లో జాయిన్ చేసారు.  అప్పటికే పరిస్థితి విషమించడంతో వారం రోజుల క్రితమే కోమాలోకి  వెళ్లిన ఆయన బుధవారం తుది శ్వాస విడిచారు. దీంతో  తెలుగు చిత్ర పరిశమ్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  నరసింగరావు కి  భార్య, కుమార్తె ఉన్నారు. పాతబస్తీ, ఊరికి మొనగాడు,కుచ్చికుచ్చి కూనమ్మా వంటి చిత్రాలకు కూడా మాటల రచయితగా పని చేసారు

సినిమాల్లోకి రాక ముందు  ‘బొమ్మలాట’ అనే  నాటకం ద్వారా మంచి  ఫేమ్ ను సంపాదించుకున్నారు. ఆయన ఒకప్పుడు  దూరదర్శన్ ప్రేక్షకులని ఉర్రూతలూగించిన  ‘తెనాలి రామకృష్ణ’  సీరియల్‌కి కూడా  రచయితగా మంచి పేరు సంపాదించారు. అలాగే ఈ టీవీ లో ఫేమస్ సీరియల్స్ గా గుర్తింపు పొందిన వండర్ బోయ్, లేడీ  డిటెక్టవ్, అంతరంగాలు వంటి సీరియల్స్ కి  కూడా నరసింగరావు మాటలు అందించారు. నడిమింటి నరసింగరావు మృతికి  పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

ఇదీ చదవండి:  చిరంజీవిని మెగాస్టార్ ను చేసిన టాప్ మూవీస్ ఇవే..

ఇదీ చదవండి: ‘భోళా శంకర్’సహా చిరు కెరీర్ లో రాడ్ రంబోలా మూవీస్ ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News