Naga Shaurya: నాగ శౌర్య బర్త్​ డే స్పెషల్​- కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్​..

Naga Shaurya: నేడు యువ హీరో నాగ శౌర్య పుట్టిన రోజు. ఈ సందర్భంగా నాగ శౌర్య కొత్త సినిమా అప్​డేట్స్ వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 22, 2022, 03:07 PM IST
  • నాగ శౌర్య కొత్త మూవీ అప్​డేట్ వచ్చేసింది
  • పూర్తి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కుతున్నట్లు సమాచారం
  • ఓ పాట మినగా మిగతా షూటింగ్ ఇప్పటికే పూర్తి!
Naga Shaurya: నాగ శౌర్య బర్త్​ డే స్పెషల్​- కొత్త సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్​..

Naga Shaurya: యంగ్​ హీరో నాగశౌర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమాకు 'కృష్ణ వ్రింద విహారి' అనే టైటిల్​ను (Krishna Vrinda Vihari movie Updates) ఫిక్స్​ చేశారు. నేడు (జనవరి 22) నాగశౌర్య పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఈ సినిమాలో నాగ శౌర్య ఫస్ట్​ లుక్​ను కూడా విడుదల చేసింది (Naga Shaurya birth day) చిత్ర యూనిట్.

సినిమా టైటిల్​కు తగ్గట్లుగానే.. సరికొత్త లుక్​లో నాగ శౌర్య ఫస్ట్ లుక్​ (Krishna Vrinda Vihari first look) ఉంది. పూర్తి ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా ఈ మూవీ రానుందట. ఈ సినిమాలో నాగ శౌర్యకు జోడీగా షెర్లి శెటియా నటిస్తోంది.

ఈ సినిమాలో సీనియర్ నటి రాధిక ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్లు (Radhika in Naga Shaurya movie) సమాచారం.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Shaurya (@actorshaurya)

ఇక ఈ సినిమాకు అనీశ్​ దర్శకత్వం వహిస్తున్నారు. 'అలా ఎలా', 'లవర్', 'గాలి సంపత్​' వంటి సినిమాలతో అనీశ్​ డైరెక్టర్​గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అనీశ్​కు డైరెక్టర్​గా ఇది నాలుగో సినిమా కాగా.. నాగ శౌర్యకు ఇది 22వ సినిమా.

ఈ సినిమాకు సాయి శ్రీరామ్​ సినిమాటోగ్రఫర్​గా పని చేస్తుండగా.. మహతి సంగీతమందిస్తున్నారు. నాగ శౌర్య సొంత బ్యానర్​ అయిన ఐరా క్రియేషన్స్​ ఈ సినిమాను (Krishna Vrinda Vihari  full details) నిర్మస్తోంది.

ఈ సినిమా షూటింగ్ దాదాపు ముగింపు దశకు చేరినట్లు సమాచారం. ఒక సాంగ్​ మినహా మిగతా భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలిసింది. దీనితో పోస్ట్ ప్రొడక్షన్​ పనులు వేగంగా పూర్తి చేసి.. విడుదల తేని త్వరలోనే ప్రకటించనుంది (Krishna Vrinda Vihari release date) చిత్ర యూనిట్​.

Also read: Allu arjun talk show: త్వరలో హోస్ట్​గా అల్లు అర్జున్- ఇక తగ్గేదేలే!

Also read: Mahesh Babu NBK: గౌతమ్ నా చెయ్యి అంత పుట్టాడు.. డబ్బుండి కాబట్టి సరిపోయింది! లేని వాళ్ల పరిస్థితేంటనే ఇలా చేస్తున్నా: మహేష్ బాబు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News