Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..

Game Changer: రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. తాజాగా ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఉత్తర ప్రదేశ్ రాజధాని లక్నో లో ఘనంగా జరిగింది. ఈ సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ లో హీరో రామ్ చరణ్.. దర్శకుడు శంకర్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 10, 2024, 12:56 PM IST
Game Changer: ఏకంగా శంకర్ ను అంత మాట అనేసిన రామ్ చరణ్.. వైరల్ అవుతున్న కామెంట్స్..

Game Changer: గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, తమిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబోలో వస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’.  ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా తెలుగు, తమిళం, హిందీ భాషల్లో  సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ సినిమా విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు.  ఈ సందర్భంగా ఈ మూవీ హీరో
రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘అందరికీ నమస్కారం. మా కోసం ఇక్కడి వరకు వచ్చిన మీడియా, ఫ్యాన్స్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు. శంకర్ గారిని ఈ రోజు మిస్ అవుతున్నాం. ఆయన ఈ సినిమా  ఫైనల్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఆయనతో కలిసి పని చేయడం తన అదృష్టమన్నారు. భారత్ లో లక్నో చాలా పెద్ద నగరం. ఇక్కడ మనుషులు మనసులు కూడా చాలా పెద్దవి. మా గత చిత్రాన్ని ఇక్కడ పెద్ద మనసుతో ఆదరించారు. ఇక్కడ ‘గేమ్ చేంజర్’ టీజర్ లాంచ్ జరగడం ఆనందంగా ఉందన్నారు.

Add Zee News as a Preferred Source

కియారా అద్వానీ మాట్లాడుతూ.. ‘లక్నోలో మా చిత్ర ప్రయాణం షురూ చేయడం సంతోషంగా ఉందన్నారు. రామ్ చరణ్ తో మరోసారి కలిసి  పనిచేయడం హ్యాపీగా ఉందన్నారు. . నేను ఇక్కడకు రావాలని చాలా రోజుల నుంచి ఎదురుచూశాను. శంకర్ గారి వల్ల ఈ రోజు మేం  లక్నోకు వచ్చామన్నారు. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందన్నారు.  

అంజలి మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్‌లో నా పాత్ర విని వెంటనే ఓకే చేసేసాను. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుంది. నాకు ఎంతో ఛాలెంజింగ్‌గా అనిపించిన క్యారెక్టర్. ఈ చిత్రం ఒప్పుకోవడానికి రామ్ చరణ్, శంకర్, దిల్ రాజు కూడా ఓ కారణమన్నారు. సంక్రాంతికి ఈ చిత్రంతో హిట్టు కొట్టబోతున్నామన్నారు. అందరికి ఈ సినిమా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తం చేసారు.  

ఎస్ జే సూర్య మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్’ టీజర్‌ను మాత్రమే చూశారు. ఇక అసలు చిత్రం  ముందుంది. ఈ రోజు శంకర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయారు.  కానీ ఎడిటింగ్‌లో ఆయన బిజీగా ఉన్నారు. రామ్ చరణ్, శంకర్ కలిసి చేసిన ఈ చిత్రం ప్రేక్షకులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లడం గ్యారంటీ అన్నారు.  సంక్రాంతికి పెద్ద హిట్ కొట్టబోతున్నామన్నారు.

నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. మా ప్రొడక్షన్‌ హౌస్ లో 50వ చిత్రమిది. శంకర్ తో పనిచేయాలని ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటికీ నెరవేరిందన్నారు. పైగా అది రామ్ చరణ్‌తో అవ్వడం మరింత  హ్యాపీగా ఉందన్నారు. తెలుగులో శంకర్ చేస్తోన్న ఫస్ట్ డైరెక్ట్ మూవీ. ఇప్పటి వరకు తెలుగు డబ్బింగ్ సినిమాలతో అలరించిన శంకర్.. డైరెక్ట్ తెలుగు మూవీతో తెలుగు ప్రేక్షకులను అలరించడం పక్కా అని చెప్పారు.

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News