Gangs Of Godavari 1st Week Box Collections: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ కలెక్షన్స్.. హిట్ రేంజ్ కు ఎంత దూరంలో అంటే.. ?

Gangs Of Godavari 1st Week Box Collections: తెలుగులో డిఫరెంట్ మూవీస్ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్ సేన్. తాజాగా ఈయన ‘ గ్యాంగ్ ఆఫ్ గోదావరి' మూవీతో పలకరించారు. గత వారం విడుదలైన ఈ సినిమా నిన్నటితో ఫస్ట్ వీక్ పూర్తి చేసుకుంది.

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 7, 2024, 11:28 AM IST
Gangs Of Godavari 1st Week Box Collections: ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ ఫస్ట్ వీక్ బాక్సాఫీస్  కలెక్షన్స్.. హిట్ రేంజ్ కు ఎంత దూరంలో అంటే.. ?

Gangs Of Godavari 1st Week Box Collections: విశ్వక్ సేన్ తెలుగు చిత్ర పరిశ్రమలో అతి తక్కువ సమయంలో మాస్ కా దాస్ అంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. తాజాగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు ఓ మోస్తరు టాక్ తో కూడా మంచి వసూళ్లనే రాబడుతోంది. రీసెంట్ గా ‘గామి’ వంటి డిఫరెంట్ సబ్జెక్ట్ తో మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంలో అఘోరా పాత్రలో అలరించాడు. ఆ సినిమా చేసిన బిజినెస్ కు మంచి వసూళ్లనే రాబట్టి హిట్ అనిపించకుంది. తాజాగా విశ్వక్ సేన్ నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి‘ మూవీ విషయానికొస్తే.. పేరు బట్టి ఇది పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. ప్రపంచంలో 650 పైగా థియేటర్స్ లో విడుదలైంది. ఈ సినిమా ఫస్ట్ వీక్ బాక్సాఫీస్ వసూళ్ల విషయానికొస్తే..

తెలంగాణ+ ఆంధ్ర ప్రదేశ్ లో కలిపి రూ. 8.46 కోట్ల షేర్ (రూ. 14.75 కోట్ల గ్రాస్) రాబట్టింది.
కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ - 0.62 కోట్లు
ఓవర్సీస్.. 1.12 కోట్లు
ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.20 కోట్ల షేర్ (18.70 కోట్లు గ్రాస్ ) వసూళ్లను రాబట్టింది.
 
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 10.30 కోట్ల ప్రీ రిలీజ్ బిజనెస్ చేసింది. రూ. 11 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలో దిగిన ఈ సినిమా 0.85 కోట్ల షేర్ అందుకోవాల్సి ఉంది. మొత్తంగా ఈ వీకెండ్ వరకు పెద్దగా సినిమాలు ఏమి లేవు కాబట్టి ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలున్నాయి.  ఈ చిత్రంలో విశ్వక్‌సేన్ సరసన నేహా శెట్టి హీరోయిన్ గా నటించింది. అంజలి మరో స్పెషల్ రోల్లో నటించింది. ఈ చిత్రంలో అయేషా ఖాన్ స్పెషల్ సాంగ్ చేసింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ తర్వాత మెకానిక్ రాఖీ మూవీతో పలకరించబోతున్నాడు.

Rear more: Prewedding shoot: ప్రీవెడ్డింగ్ షూట్ లో తాత హల్ చల్.. కొత్త జంటకు ట్విస్ట్ మాములుగా లేదుగా.. వీడియో వైరల్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News