Hello Meera Movie Review : హలో మీరా రివ్యూ.. ఒంటరి అమ్మాయి ప్రయాణం

Hello Meera Movie Review సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అంటే మామూలు విషయం కాదు. ఒకే పాత్రను చూపిస్తూ థియేటర్లో జనాల్ని కూర్చోపెట్టడం అంటే అంత సులభమైన పనేమీ కాదు. అయితే హలో మీరా సినిమా వచ్చింది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 20, 2023, 07:40 PM IST
  • సింగిల్ కారెక్టర్‌తో సినిమా
  • హలో మీరాతో మేకర్ల ప్రయోగం
  • గార్గేయి ఎలా నటించిందంటే?
Hello Meera Movie Review : హలో మీరా రివ్యూ.. ఒంటరి అమ్మాయి ప్రయాణం

Hello Meera Movie Review సింగిల్ కారెక్టర్‌తో సినిమా అంటూ హలో మీరా గురించి ముందు నుంచి ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క పాత్రతో సినిమాను ఎలా తీస్తారు.. కథ ఎలా ఉంటుంది.. కథనం ఎలా సాగుతుంది? అనే అనుమానాలు అందరికీ పుట్టుకొచ్చాయి. దానికి సమాధానంగా హలో మీరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఓ సారి చూద్దాం.

కథ
మీరా (గార్గేయి) ఇంకో రెండ్రోజుల్లో పెళ్లి చేసుకోబోతోందనగా.. ఆమె జీవితంలో అనుకోని ఘటన జరుగుతుంది. కళ్యాణ్ అనే వ్యక్తిని మీరా ప్రేమించి పెళ్లి చేసుకునేందుకు సిద్దంగా ఉంటుంది. అయితే మీరా తన పెళ్లి పనుల్లో భాగంగా విజయవాడలో బిజీగా ఉంటుంది. అదే సమయంలో మీరా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ సుధీర్ హాస్పిటల్‌లో చేరతాడు. ప్రేమించి మోసం చేసిందనే ఆరోపణలను మీరా ఎదుర్కొంటుంది. ఉన్నపలంగా విజయవాడ నుంచి హైద్రాబాద్‌లోని రాయదుర్గం పోలీస్ స్టేషన్‌కు రావాల్సి వస్తుంది మీరా. ఈ క్రమంలో మీరాకు ఎదురైన పరిస్థితులు ఏంటి? అసలు సుధీర్ ఎందుకు హాస్పిటల్లో చేరాడు? కళ్యాణ్‌ చివరకు ఏం చేశాడు? మీరా ప్రయాణంలో ఎదురైన కష్టనష్టాలు ఏంటన్నది కథ.

హలో మీరా సినిమాలో నటీనటుల గురించి చెప్పడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే ఉండేది ఒక్క పాత్రే. కారులో మీరా ప్రయాణం చేస్తుంటుంది. స్క్రీన్ మీద మీరా తప్పా మరో కారెక్టర్ కనిపించదు. నవ్వించినా, ఏడిపించినా, మనలో ఆందోళనను కల్గించినా, భయానికి గురి చేసినా కూడా మీరా పాత్రతోనే అవుతుంది. అన్ని ఎమోషన్స్‌ను మీరా పాత్రలో గార్గేయి చక్కగా పలికించింది. గార్గేయి ఈ సినిమాలో నవ్విస్తుంది.. ఏడిపిస్తుంది.

విశ్లేషణ

హలో మీరా సినిమాతో దర్శకుడు కాకర్ల శ్రీనివాసు, నిర్మాతలు డా. లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ప్రయోగం చేశారు. సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించాలనుకోవడమే డైరెక్టర్ సాహసం. అయితే ఇందులో ఓ అమ్మాయికి సమాజంలో ఎదురయ్యే పరిస్థితులు, అనుమానంతో అమ్మాయిలను ఎలా దూషిస్తారు.. అసలు అమ్మాయిలను ఇంట్లో తల్లి కూడా అర్థం చేసుకోకపోవడం వల్ల జరిగే పరిస్థితులు, తండ్రి అండగా ఉంటే అమ్మాయిలు ఎంత ధైర్యంగా ఉంటారు అనే విషయాలెన్నో ఇందులో చూపించారు.

Also Read:  IT Raids on Mythri : మైత్రీ కార్యాలయంలో రెండో రోజూ ఐటీ దాడులు.. వందల కోట్లపై ఆరా

ప్రేమ పేరుతో ఎలాంటి మోసాలు జరుగుతాయి... అమ్మాయిలు అప్రమత్తంగా ఉండకపోతే ఎలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయి.. అసలు అమ్మాయి అంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎంతో ధృడంగా ఉండాలని సందేశాన్ని ఇస్తూ హలో మీరా సినిమాను మలిచాడు దర్శకుడు. సినిమా నిడివి తక్కువగా ఉండటం కలిసి వస్తుంది. తెరపై ఒకే పాత్రను చూపిస్తూ ఉన్నా కూడా.. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఇలా అన్ని డిపార్ట్మెంట్లు కలిసి చక్కగా పని చేయడంతో ఎక్కడా బోర్ కొట్టించినట్టు అనిపించదు. మాటలు, పాటలు ఆలోచింపజేస్తాయి.

రేటింగ్ 2.75

Also Read: Mrunal Thakur : 'సీత'ను రొమాంటిక్‌గానే చూడాలనుకుంటున్నారా?.. నెటిజన్ల కోరిక ఇదే

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News