Helo Meera Release Date : ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న గార్గేయి

Helo Meera Release Date ఎవ్వరికీ చెప్పొద్దు అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హలో మీరా. ఇప్పుడు రెండో సినిమాతో రెడీగా ఉంది. హలో మీరా అంటూ గార్గేయి తెలుగు ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 1, 2023, 08:14 PM IST
  • నెట్టింట్లో హలో మీరా సందడి
  • ఏప్రిల్ 21న రానున్న హలో మీరా
  • హీరోయిన్‌గా గార్గేయి హల్చల్
Helo Meera Release Date : ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న గార్గేయి

Gargeyi Hello Meera Movie సింగిల్ కారెక్టర్‌తో సినిమాను నడిపించడం అనేది మామూలు విషయం కాదు. కానీ నిర్మాతలు ఓ ప్రయోగం చేసేందుకు ముందుకు వచ్చారు. గార్గేయి యల్లాప్రగడ ప్రధాన పాత్రలో 'హలో మీరా' అనే సినిమా రాబోతోంది. ఒకే ఒక పాత్రతో సినిమాను తెరకెక్కించడం అనే పాయింట్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించేస్తోంది.

హలో మీరా అంటూ డైరెక్టర్ కాకర్ల శ్రీనివాసు ఓ ప్రయోగాన్ని చేస్తున్నాడు. ప్రముఖ దర్శకులు శ్రీ బాపు గారితో పలు సినిమాలకు సహ దర్శకునిగా పనిచేసిన అనుభవాన్ని రంగరించి ఈ 'హలో మీరా' సినిమాతో ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నాడు కాకర్ల శ్రీనివాసు. లూమియర్ సినిమా బ్యానర్‌పై జీవన్ కాకర్ల సమర్పణలో.. డా. లక్ష్మణరావు  దిక్కల, వరప్రసాదరావు దుంపల, పద్మ కాకర్ల ఈ సినిమాను నిర్మించారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్, ట్రైలర్, పాటలు, పోస్టర్లు అన్నీ కూడా సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ దక్కించుకున్నాయి. ప్రస్తుతం హలో మీరా మీద మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. తాజాగా ఈ సినిమా సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. హలో మీరా సినిమాను ఏప్రిల్ 21న విడుదల చేయబోతున్నట్టుగా మేకర్లు ప్రకటించారు.

సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ఇకపై మరింతగా ప్రమోషన్ కార్యక్రమాలు పెంచబోతున్నట్టుగా నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి ఎస్.చిన్న సంగీతం అందించారు. తిరుమల ఎం తిరుపతి పొడక్షన్ డిజైనర్‌గా, కత్రి మల్లేష్ , M రాంబాబు [చెన్నై] ప్రొడక్షన్ మేనేజర్స్ గా పని చేశారు. ఈ సినిమాకు సూరి సాధనాల అసోసియేట్ డైరెక్టర్ గా పని చేశారు. ఈ చిత్రానికి హిరణ్మయి కల్యాణ్ మాటలు రాశారు. ఈ మూవీకి రాంబాబు మేడికొండ ఎడిటర్ గా వర్క్ చేశారు.

Also Read:  Dasara Collection : రెండో రోజుకే బ్రేక్ ఈవెన్?.. దసరా మేనియా.. నాని రేంజ్ ఇదే

Also Read: Ameesha Patel Bikini : బికినీలో అమిషా పటేల్.. సీనియర్ భామ భారీ అందాల ప్రదర్శన

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News