PK Rosy Google Doodle: దేశంలోనే మొదటి దళిత నటి.. సినిమాలో నటించిందని ఇల్లు తగలబెట్టేశారు!

PK Rosy Google Doodle: ఈ మధ్య గూగుల్ ఎప్పటికప్పుడు ప్రముఖుల పుట్టిన రోజున వారి బొమ్మలతో డూడుల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా పికె రోసీ గౌరవార్థం గూగుల్ ఈరోజు డూడుల్‌ను రూపొందించింది.   

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 10, 2023, 01:27 PM IST
PK Rosy Google Doodle: దేశంలోనే మొదటి దళిత నటి.. సినిమాలో నటించిందని ఇల్లు తగలబెట్టేశారు!

PK Rosy 120th Birth Anniversary: మలయాళ చిత్రసీమలో తొలి మహిళా నటిగా గుర్తింపు పొందిన పికె రోసీ గౌరవార్థం గూగుల్ ఈరోజు డూడుల్‌ను రూపొందించడం చర్చనీయాంశం అయింది. 1903 ఫిబ్రవరి 10న రోజీ కేరళ రాజధాని తిరువనంతపురంలో జన్మించింది. రోజీకి నటన పట్ల చిన్నవయసులోనే ఇష్టం మొదలైంది. సమాజంలోని అనేక వర్గాలలో, ముఖ్యంగా మహిళలకు సాంస్కృతిక కళలలో పెద్దగా ప్రవేశంలేని రోజుల్లోనే రోజీ మలయాళ సినిమా విగతకుమారన్ (ది లాస్ట్ చైల్డ్)లో తన పాత్రతో అనేక అడ్డంకులను బద్దలు కొట్టేలా నటించింది.

ఈరోజుకీ అందుకే ఆమె కథ చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. అయితే ఆ సినిమాలో నటించిన కారణంగా రోజీ జీవితాంతం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది. ఈ రోజు కూడా గూగుల్‌లో ఆమెకు సంబందించిన ఒక అస్పష్టమైన చిత్రం మాత్రమే ఉన్నది, ఆమెకు సంబంధించిన ఇతర ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏమీ లేవు.  పీకే రోసీ మలయాళ సినిమా మొదటి నటి,  భారతీయ సినిమాల్లోనే మొదటి దళిత నటి. ఈ చిత్రంలో రోజీ సరోజిని అనే నాయర్(పెద్ద కులం) మహిళగా నటించింది.

సినిమా విడుదలైనప్పుడు, దళిత మహిళను కథానాయికగా సినిమా చేయడాన్ని వ్యతిరేకిస్తూ అగ్రవర్ణాల వారు నిరసనలు తెలిపారు. ఒక కుల సంఘం సభ్యులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు ఆమె ఇంటిని అగ్రవర్ణాల వారు తగులబెట్టారని కూడా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో తన ప్రాణాలను కాపాడుకోవడానికి, రోజీ తమిళనాడుకు వెళ్లే లారీలో పారిపోయి, లారీ డ్రైవర్ కేశవన్ పిళ్లైని వివాహం చేసుకుని 'రాజమ్మాళ్'గా తన జీవితాన్ని గడిపింది. ఆమె ఎప్పుడూ మంచి కీర్తి సంపాదించలేదు సరికదా నటనా జీవితానికి దూరంగా జీవించింది.

ఇక ఆమెకు గుర్తుగా మలయాళ సినిమా మహిళా నటీమణుల సంఘంకి పికె రోజీ ఫిల్మ్ సొసైటీ అని పేరు పెట్టుకుంది. అలా ఆమె జీవితం మొదటి సినిమానే చివరి సినిమా అయింది. తమిళనాడు పారిపోయిన తర్వాత మళ్లీ నట ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు.ఇక ఆమె తర్వాత ఎందరో నటీమణులు మలయాళ సినిమాల్లోకి ప్రవేశించి నేడు సినిమా ప్రపంచాన్ని సైతం శాసిస్తున్నారు. ఇక ఈరోజు ఆమె పుట్టినరోజు కావడంతో సెర్చ్ ఇంజన్ గూగుల్ ఆమె గౌరవార్థం 'పికె రోసీ, మీ ధైర్యం, మీరు వదిలిపెట్టిన వారసత్వానికి ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. 

Also Read: Aha Video Crashed: అనుకున్నంతా అయింది.. పవన్ దెబ్బకు 'ఆహా' అనిపించారు!

Also Read: Amigos Movie Review: కళ్యాణ్ రామ్ అమిగోస్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

 
 

Trending News