Ram Charan Birthday Gift: ఆచార్యకు తోడైన సిద్ధ.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్

Ram Charan Birthday Gift | తండ్రి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన షూటింగ్‌లో తన పాత్ర షూట్ ముగించుకున్నాడు రామ్ చరణ్.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 27, 2021, 12:44 PM IST
Ram Charan Birthday Gift: ఆచార్యకు తోడైన సిద్ధ.. హ్యాపీ బర్త్‌డే రామ్ చరణ్

Ram Charan Birthday Gift | మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆచార్య. తండ్రి నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. రాజమండ్రి సమీపంలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన షూటింగ్‌లో తన పాత్ర షూట్ ముగించుకున్నాడు రామ్ చరణ్.

నేడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. చెర్రీ పుట్టినరోజు సందర్భంగా నేడు రామ్ చరణ్ బర్త్ డే గిఫ్ట్ ప్రేక్షకులకు అందింది. ఆచార్యలో సిద్ద పాత్రలో రామ్ చరణ్(Ram Charan)‌ లుక్ ఇటీవల విడుదల చేశారు. తాజాగా తన తండ్రి చిరంజీవితో కలిసి సిద్ధ పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్న ఓ లుక్‌ను ఆచార్య మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. ఆచార్యకు తోడైన సిద్ధ అంటూ మెగా అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

చెర్రీ బర్త్‌డే సందర్భంగా టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి RRR మూవీలో అల్లూరి సీతారామరాజు పాత్రలో ఉన్న పోస్టర్‌ను నిన్న అందించాడు. నేడు రామ్ చరణ్ అభిమానులకు ఆచార్యలో చెర్రీ పోస్టర్‌ను అందించి బర్త్‌డే గిఫ్ట్ ఇచ్చారు. ఆచార్య ‘సిద్ధ’ అని మెగాస్టార్ చిరంజీవి ఈ పోస్టర్ విడుదల చేశారు. తనయుడు రామ్ చరణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మెగా స్టార్ బర్త్ విషెస్, సిద్ధ లుక్ పోస్టర్ రిలీజ్‌పై రామ్ చరణ్ స్పందించాడు. నీతో పాటు కలిసి నటించడం నాకు ఎప్పటికీ కల లాంటిది. ఈ కల నిజమైంది నాన్నా, ఇంతకు మించి పుట్టినరోజు బహుమతి ఇంకేముంటుంది మీరే నాకు ఆచార్య అని రామ్ చరణ్ ట్వీట్ చేశారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News