Ustad Bhagat Singh Glimpse : మే 11న ఉస్తాద్ అప్డేట్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ

Ustad Bhagat Singh Glimpse పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి గ్లింప్స్ రాబోతోందంటూ మేకర్లు అప్డేట్ ఇచ్చారు. దీంతో దేవీ శ్రీ ప్రసాద్ ఇచ్చే ఆర్ఆర్ ఎలా ఉంటుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : May 1, 2023, 06:30 PM IST
  • ఉస్తాద్ గ్లింప్స్‌పై అప్డేట్
  • మే 11న పవర్ స్టార్ సందడి
  • దేవీ ఆర్ఆర్ మీదే ఫోకస్
Ustad Bhagat Singh Glimpse : మే 11న ఉస్తాద్ అప్డేట్.. పవర్ స్టార్ ఫ్యాన్స్ బీ రెడీ

Ustad Bhagat Singh Glimpse పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు ఈ ఏడాది వరుసగా అప్డేట్ల మోత ఉండబోతోంది. అసలే ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ ఫుల్ స్వింగులో ఉన్నాడు. వరుసగా సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఈ ఏడాది రెండు సినిమాలు అయినా థియేటర్లోకి వచ్చేలా ఉన్నాయి. వినోదయ సిత్తం జూన్‌లో రాబోతోంది. ఇక హరీష్‌ శంకర్ తీస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇప్పుడు ఫుల్ స్వింగులో జరగనుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే సంగీతాన్ని ఇచ్చేందుకు రంగంలోకి దిగాడు.

గబ్బర్ సింగ్ కాంబో మళ్లీ రిపీట్ కాబోతోంది. ఈసారి గబ్బర్ సింగ్‌ను మించేలా హరీష్‌ శంకర్ దేవీ శ్రీ ప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మేకర్లు ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేయబోతోన్నట్టుగా తెలిపారు. మే 11న ఈ మూవీ నుంచి గ్లింప్స్ రాబోతోందంటూ వదిలిన వర్కింగ్ స్టిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఉస్తాద్ సినిమా విజయ్ నటించిన తేరి సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. అసలే తేరి సినిమాలో అదిరిపోయే ఎలివేషన్ సీన్లు చాలానే ఉంటాయి. అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్‌లు సినిమాలో ఉంటాయి. అయితే ఇందులోనూ పవన్ కళ్యాణ్‌ పోలీస్ ఆఫీసర్‌గానే కనిపించబోతోన్నాడు.

 

తేరి సినిమాను పూర్తిగా తెలుగు వారి అభిరుచికి తగ్గట్టుగానే మార్పులు చేర్పులు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా అయితే అభిమానులు ఎలా కోరుకుంటారో అలానే ఉంటుందని, గబ్బర్ సింగ్‌ను మించేలా ఉంటుందని మేకర్లు కూడా ఎంతో ధృడంగా నమ్ముతున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు.. షూటింగ్ ఎప్పుడు పూర్తవుతుందన్నది మాత్రం మేకర్లకు కూడా తెలియడం లేదు.

Also Read:  Chaithanya Master Suicide : ఢీ కొరియోగ్రఫర్ మృతి.. ఆ కారణాలతోనే సూసైడ్

పవన్ కళ్యాణ్‌ మొన్నటి వరకు బాంబేలో ఓజీ సినిమా షూటింగ్ చేస్తూ బిజీగా ఉన్నాడు. వారం రోజులకు పైగా అక్కడ సుజిత్ షూటింగ్ చేశాడు. ఆన్ లొకేషన్ నుంచి బయటకు వచ్చిన ఫోటోల్లో పవన్ కళ్యాణ్‌ ఎంత స్టైలీష్‌గా ఉన్నాడో అందరికీ తెలిసిందే. హరి హర వీర మల్లు సినిమా షూటింగ్ సంగతులు మాత్రం బయటకు రావడం లేదు.

Also Read:  Mallemala Remunerations : ఢీ షోలో చాలీచాలని రెమ్యూనరేషన్‌లు!.. కొరియోగ్రఫర్ మృతితో మల్లెమాలపై మరో మరక

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News