HCA Member Monica GLeberman : ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరువుతీసిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్.. ట్రోలింగ్‌పై ట్వీట్

HCA Member Monica GLeberman హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఇచ్చిన అవార్డు వేడుకల్లో రామ్ చరణ్‌ రచ్చ చేశాడు. రామ్ చరణ్‌ ప్రత్యేక ఆహ్వానం మీద అక్కడకు వెళ్లాడు. ఓ అవార్డు ఇచ్చిన ప్రజెంటర్‌గా మారాడు. ఇక ఈ వేడుకల్లోనే ఆర్ఆర్ఆర్ సినిమాకు నాలుగు అవార్డులు వచ్చాయి.

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 27, 2023, 08:21 PM IST
  • హాలీవుడ్‌లో రామ్ చరణ్‌ క్రేజ్
  • ట్రోల్స్ చేస్తోన్న నందమూరి ఫ్యాన్స్
  • కౌంటర్లు వేసిన హెస్‌సీఏ మెంబర్
HCA Member Monica GLeberman : ఎన్టీఆర్ ఫ్యాన్స్ పరువుతీసిన హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ మెంబర్.. ట్రోలింగ్‌పై ట్వీట్

Monica GLeberman ABout Ram Charan గత వారం నుంచి రామ్ చరణ్ గురించి సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలు, హాలీవుడ్ అడ్డాలో రామ్ చరణ్‌ సందడి గురించి అందరికీ తెలిసిందే. రామ్ చరణ్ గత వారం రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉన్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి ప్రత్యేక ఆహ్వానం రావడం, అక్కడకి వెళ్లి అవార్డును ప్రజెంట్ చేయడం, ఆర్ఆర్ఆర్ సినిమాకు నాలుగు అవార్డులు రావడం అందరికీ తెలిసిందే.

రామ్ చరణ్‌ను బెస్ట్ యాక్టర్ అని, ఇండియన్ సూపర్ స్టార్ అని హాలీవుడ్ నటీనటులు పొగిడేశారు. హాలీవుడ్ నటీనటులు, హెచ్‌సీఏ మెంబర్స్ సైతం రామ్ చరణ్‌ను ఆకాశానికెత్తేశారు. అయితే ఓ నటి మాత్రం రామ్ చరణ్‌ అని పలకలేకపోయింది. రామ్ అని పిలిచింది. ఆ తరువాత చరణ్ అని పిలిచింది. దీంతో నందమూరి ఫ్యాన్స్ ఆ క్లిప్పుని ట్రోల్ చేశారు. నీ పేరు కూడా వాళ్లకి సరిగ్గా తెలియడం లేదు కదా? అని ట్రోల్ చేశారు.

ఇక హెచ్‌సీఏ మెంబర్ అయిన మోనికా గ్లెబర్మన్ అయితే రామ్ చరణ్ పక్కన నిల్చోవడంతోనే సంబరపడిపోయింది. ఆ ఉత్సుకతను ఆపుకోలేక ఈవెంట్ కంటే ముందే రామ్ చరణ్‌తో దిగిన ఫోటోను షేర్ చేసింది. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఆ ట్వీట్‌ను ట్రోల్ చేశారు. పెయిడ్ క్యాంపైన్ మొదలు పెట్టారు. దీంతో ఈ ట్రోలింగ్‌ను చూసిన సదరు నటి, హోస్ట్, మెంబర్ మండి పడింది.

 

అసలు విషయాన్ని చెప్పింది. అదేమీ పెయిడ్ ట్వీట్ కాదని, తనకు ఎవ్వరూ డబ్బులు ఇవ్వలేదని, రామ్ చరణ్‌ను చూసిన ఆనందంలోనే ఆ ట్వీట్ ముందుగా పెట్టాను అని వివరణ ఇచ్చింది. దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పరోక్షంగా కౌంటర్లు వేసినట్టు అయింది. మొత్తానికి మన ఫ్యాన్ వార్ మాత్రం హాలీవుడ్‌ రేంజ్‌లో సెగ తాకినట్టు కనిపిస్తోంది.

ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట అయితే ఆస్కార్ లెవెల్లో సత్తా చాటేలా కనిపిస్తోంది. ఆస్కార్ నామినేషన్‌లో ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాట ఉండటమే ఓ చరిత్రలా నిలిచింది. ఒక వేళ ఆస్కార్ గెలిస్తే మాత్రం ఇండియన్ మూవీ హిస్టరీలోనే ఓ రికార్డ్ అవుతుంది.

Also Read:  Rahul Sipligunj : బికినీ భామలతో రాహుల్ సిప్లిగంజ్ రొమాన్స్.. బడ్జెట్ బద్దల్ బాషింగాలైంతాందట!

Also Read: Naga Chaitanya - Samantha : నాగ చైతన్య అంటే మరీ అంత ద్వేషమా?.. అందుకే అలా చేసిందా? సమంతకు చైతూకి అదే తేడా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News