Anasuya Diet: ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి అనసూయ. అప్పట్లో ఆమె కోసమే.. ఆ షో చూసేవారు అంటే అతిశయోక్తి కాదు. తన అందంతో అ షోకి టిఆర్పిని మరింత పెంచింది ఈ బ్యూటీ. ఆ తరువాత కొద్ది రోజులకు అనసూయ కి సినిమాలలో కూడా చాన్సులు రావడం మొదలయ్యాయి. క్షణం సినిమాలో కనిపించిన అనసూయ.. తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో సినిమా చాన్సులు దక్కించుకుంది.
ముఖ్యంగా సుకుమార్ దర్శకత్వంలో.. రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా అనసూయ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్ లో కనిపించి అందరినీ మౄస్మరైస్ చేసింది ఈ నటి. ఆ చిత్రంలో నటనతో అదరగొట్టగా.. అనసూయ కి కొన్ని లేడి ఓరియంటెడ్..లో-బడ్జెట్ చిత్రాలలో హీరోయిన్ గా కూడా ఛాన్స్ వచ్చింది. కాగా ఈ మధ్యనే.. మరోసారి సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాల్లో చేసి.. పాన్ ఇండియా లెవెల్లో నోటీస్ అయ్యింది.
ఇక ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న పుష్ప 2 సినిమా షూటింగ్ లో పాల్గొంటుంది.. ఈ సినిమా షూటింగ్ నుంచి తన డైట్ షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది అనసూయ. తన డైట్ చూసిన వాళ్లకి.. అనసూయ.. ఇందుకేనేమో ఇప్పటికి ఇంత అందంగా.. ఉంది అని క్లారిటీ రాక మానదు.
బాయిల్డ్ ఎగ్, టొమాటో ముక్కలు ఇలా లైట్ ఫుడ్‌ని.. ఫోటో పెట్టి.. తన కోసం తాను చేస్తున్న డైట్ ఇది అని.. ప్రస్తుతం తాను పుష్ప షూటింగ్లో ఉన్నాను అంటూ ఒక స్టేటస్ పెట్టింది.. కాగా పెళ్లయి.. ఇద్దరు పిల్లలు.. ఉన్న ఇప్పటికే అనసూయ చాలా యంగ్ గా కనిపించే సంగతి మనకు తెలిసింది. ఇప్పుడు అనసూయ ఏమి తింటుందో చూసి.. మనం కూడా ఇది తింటే.స అనసూయ లాగా.. ఎప్పటికీ అందంగా ఉంటారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు.
Read more: Snakes repellent plants: ఈ చెట్లంటే పాములకు ఎంతో భయం.. ఆ ఇళ్లవైపు కన్నేత్తి కూడా చూడవంట..
Read more; Snakes venom: ఈ మొక్కలతో పాము విషం బలాదూర్.. ఇలా పెంచుకోవాలంటున్న నిపుణులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter