Hebah Patel: బోల్డ్ సన్నివేశాలు నటించడం హెల్ప్ అయింది.. హెబ్బా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Heebah Patel about 24 Kisses: కుమారి 21ఎఫ్ సినిమాలో బోల్డ్ గా.. నటించిన హెబ్బా పటేల్.. ఆ తర్వాత 24 కిస్సెస్ సినిమాతో మరింత రెచ్చిపోయింది. ప్రస్తుతం హనీమూన్ ఎక్స్ప్రెస్.. అనే సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్న.. హెబ్బా పటేల్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 24 కిస్సెస్ సినిమా చేయడం.. తనకి ఏ విధంగా ఉపయోగపడిందో చెప్పుకొచ్చింది.

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Jun 14, 2024, 07:18 PM IST
Hebah Patel: బోల్డ్ సన్నివేశాలు నటించడం హెల్ప్ అయింది.. హెబ్బా పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Hebah Patel Honeymoon Express: అలా ఎలా.. అనే తెలుగు సినిమాతో ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయిన.. హెబ్బా పటేల్ తెలుగులో తన రెండవ సినిమా అయిన కుమారి 21ఎఫ్ తో.. పాపులర్ అయిపోయింది. రాజ్ తరుణ్ హీరోగా నటించిన.. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద.. మంచి విజయాన్ని సాధించింది. సినిమా బాగానే హిట్ అయినప్పటికీ హెబ్బా పటేల్ కి.. అనుకున్న స్థాయిలో ఆఫర్లు రాలేదు. 

కాగా పెద్ద స్టార్లతో నటించే అవకాశం.. రాకపోయినప్పటికీ హెబ్బా పటేల్ చిన్న సినిమాలతో కెరియర్ ని బాగానే ముందుకు నడుపుతోంది. అయితే 2018 లో హెబ్బా పటేల్ నటించిన 24 కిస్సెస్.. విజయాన్ని సాధించకపోయినా.. బోలెడన్ని వివాదాల్లో అయితే ఇరుక్కుంది. సినిమా టైటిల్ చూస్తేనే సగం కంటెంట్ అర్థమయిపోతుంది. 

సినిమా మొత్తం బోలెడు కిస్ సన్నివేశాలు, లిప్ లాక్ లు, ఇంటిమేట్ సన్నివేశాలతో… హెబ్బా పటేల్ ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు పలు సినిమాలతో బిజీగా ఉన్న హెబ్బా పటేల్.. తన హనీమూన్ ఎక్స్ప్రెస్.. ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 24 కిస్సెస్ సినిమా చేయడం వల్ల.. ఈ సినిమాలో తనకి బాగా హెల్ప్ అయింది అని చెబుతోంది. 

"గతంలో 24 కిస్సెస్ సినిమా చేయడం వల్ల.. నాకు ఉండే భయాలు, సందేహాలు అన్నీ పోయాయి. సినిమా చేస్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే.. మనం మూవీ సెట్ లో ఎలాంటి భయం లేకుండా ఉండొచ్చు. ఎందుకు అంటే మనం ఎలా ఉన్నాము.. అనే విషయాన్ని ఎవరు అక్కడ పట్టించుకోరు. అందరూ తమ తమ జాబ్స్ తో బిజీగా ఉంటారు. లైట్ డిపార్ట్మెంట్, ఆర్ డిపార్ట్మెంట్ అందరూ.. వాళ్ళ వాళ్ళ పనుల్లో ఉంటారు.. కానీ మనం ఎలా ఉన్నాం అనే విషయాన్ని పట్టించుకునే టైం కూడా వాళ్లకి ఉండదు," అని చెప్పుకొచ్చింది ఈ భామ.

"నేను బయట ఎప్పుడూ నిజ జీవితంలో ఉండలేనట్టుగా.. సినిమా నన్ను చూపించింది. నేను బయట అంత రొమాంటిక్ పర్సన్ కాదు. నేను ప్రేమిస్తాను కానీ రొమాంటిక్ పర్సన్ ని కాదు. నేను నిజ జీవితంలో ఎప్పుడు ఉండలేనటువంటి.. విధంగా ఆ సినిమాలో ఉన్న సోనాలి పాత్ర నన్ను చూపించింది" అని అంటుంది హెబ్బా పటేల్. 

దీంతో ఇదివరకు ఇలాంటి.. ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించిన ఏ హీరోయిన్ కూడా ఇలా చెప్పలేదు అని, హెబ్బా పటేల్ చెప్పిన పాయింట్ లో వాస్తవం ఉంది అని నెటిజన్లు కూడా ఒప్పుకుంటున్నారు. మరి ప్రస్తుతం చేతిలో ఉన్న ప్రాజెక్టుతో హెబ్బా పటేల్ ఎంతవరకు తన కెరియర్ ని మలుపు తిప్పుకుంటుందో వేచి చూడాలి.

Also Read: Chandrababu: అధికారులకు చంద్రబాబు ఝలక్‌.. పూల బొకేలు తిరస్కరణ

Also Read: Amaravati Movement: బాబు ప్రమాణంతో 1,631 రోజుల ఉద్యమానికి బ్రేక్‌.. ఊపిరి పోసుకున్న అమరావతి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News