Nikhil: నిఖిల్ చేతుల మీదుగా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ టోర్నమెంట్.. ఇంతకీ విషయం ఏమిటంటే!

South India's Biggest Tournament: వైవిద్యమైన కథలను ఎంచుకుంటూ తన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో చెదరని ముద్ర వేశారు హీరో నిఖిల్. వివిధ రంగాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే ఈ హీరో చేతుల మీదగా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ టోర్నమెంట్ ప్రారంభమైంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 10, 2024, 03:18 PM IST
Nikhil: నిఖిల్ చేతుల మీదుగా సౌత్ ఇండియా బిగ్గెస్ట్ టోర్నమెంట్.. ఇంతకీ విషయం ఏమిటంటే!

Hero Nikhil: ఎఫ్ ఎన్ సి సి నిర్వహించు 12 ఆల్ ఇండియా ఓపెన్ బ్రిడ్జ్ టోర్నమెంట్ లాంచ్ ఈవెంట్ అతిరథ మహారధుల మధ్య నిన్న గ్రాండ్ గా జరిగింది. ఈ ప్రోగ్రాం కి హీరో నిఖిల్ అటెండ్ అయ్యి తన చేతుల మీదగా ఈ టోర్నమెంట్ ని మొదలుపెట్టాడు. చెప్పుకో తగిన విషయం ఏమిటి అంటే సౌత్ ఇండియా లోనే ఇది బిగ్గెస్ట్ టోర్నమెంట్. కాగా ఈ టోర్నమెంట్ లో పాల్గొనేందుకు మొత్తం 69 టీములు సిద్ధంగా ఉన్నాయి. 

మన పక్క దేశం చైనాలో ఈ మధ్య జరిగిన టోర్నమెంట్స్ లో సిల్వర్ మెడల్స్ గెలిచిన కొంతమంది ప్రముఖులను ఈ లాంచ్ ఈవెంట్ సందర్భంగా ఎఫ్ ఎన్ సి సి ఘనంగా సత్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  నిఖిల్,సెక్రటరీ శ్రీ ముళ్ళపూడి మోహన్ గారు, ఎఫ్ ఎన్ సి సి వైస్ ప్రెసిడెంట్ శ్రీ తుమ్మల రంగారావు గారు, ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ ఫ్రాంచెస్ కో ఓనర్ శ్రీ చాముండేశ్వరనాథ్ గారు, జాయింట్ సెక్రెటరీ శ్రీ వి ఎస్ ఎస్ పెద్దిరాజు గారు, ఫార్మర్ క్రికెటర్ మరియు ముంబై మాస్టర్స్ పాల్గొన్నారు.

ముందుగా ఈ ఈవెంట్ లో ఎఫ్ ఎన్ సి సి వైస్ ప్రెసిడెంట్ రంగారావు గారు మాట్లాడుతూ.. ‘ఈ టోర్నమెంట్ లో  పాల్గొనే అందరికీ శుభాకాంక్షలు. మన ముఖ్యఅతిథి హీరో నిఖిల్ గారిని టోర్నమెంట్ ఓపెన్ అనౌన్స్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చారు.

ఆ తరువాత హీరో నిఖిల్ గారు మాట్లాడుతూ :’ నన్ను ఈ ఈవెంట్ కి పిలిచినందుకు శ్రీ ముళ్లపూడి మోహన్ గారికి కృతజ్ఞతలు. నేను ఒక హీరోని కానీ ఈ ఓపెనింగ్ ఈవెంట్ కి వచ్చి స్పోర్ట్స్ మెన్ ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మాలాంటి హీరోలకు ఇలాంటి ఫంక్షన్స్ కి పిలిచి స్పోర్ట్స్ మెన్స్ తో కలిపి మాకు కూడా ఒక మైండ్ రిఫ్రిషింగ్ ఈవెంట్ లాగా చేయడం చాలా సంతోషంగా ఉంది ఉంది. స్పోర్ట్స్ టోర్నమెంట్ లో ఇంటర్నేషనల్ వరకు వెళ్లి ఇండియా కోసం గోల్డ్ సిల్వర్ మెడల్స్ గెలిచిన ఆటగాళ్లని కలవడం వాళ్ళని సత్కరించడం నాకు చాలా హ్యాపీగా గా ఉంది. ఈ బ్రిడ్జి టోర్నమెంట్ ద్వారా ఆడుతున్న అందరికీ ఆల్ ద బెస్ట్. ప్రస్తుతం ఉన్న యువత ఈ బ్రిడ్జ్ టోర్నమెంట్ గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా ఇంకా ఎక్కువ మంది యువకులు ముందుకొచ్చి పార్టిసిపేట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని తెలియజేశారు.

Also Read: Ap Elections 2024: ఏపీలో 2014 పొత్తులు రిపీట్, ఎవరికెన్ని సీట్లంటే

Also Read: Indiramma Housing Scheme: ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు.. ఎప్పుడు.. ఎంతిస్తారంటే..?

 

 

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News