Hero Raviteja Harassment: హీరోయిన్లు, ఐటెం గళ్స్ మీద రవితేజ అరాచకం.. మాస్ మహా రాజాపై ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు!

Harassment Allegations on Hero Raviteja: తెలుగు హీరోలు హీరోయిన్ల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న దుబాయ్ ఫిలిం క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు ఈసారి హీరో రవితేజను టార్గెట్ చేస్తూ సంచలన ఆరోపణలు చేశారు. ఆ వివరాలు  

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 14, 2023, 07:13 PM IST
Hero Raviteja Harassment: హీరోయిన్లు, ఐటెం గళ్స్ మీద రవితేజ అరాచకం.. మాస్ మహా రాజాపై ఉమైర్ సంధు సంచలన ఆరోపణలు!

Harassment Allegations on Raviteja: ఈ మధ్యకాలంలో తెలుగు హీరోలు హీరోయిన్ల పై సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లోకి ఎక్కుతున్న దుబాయ్ ఫిలిం క్రిటిక్, దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్ ఉమైర్ సంధు ఈసారి హీరో రవితేజను టార్గెట్ చేశారు. మాస్ మహారాజా రవితేజ గురించి ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలకి ఎంట్రీ ఇచ్చి అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ ప్రారంభించి ఈరోజు మాస్ మహారాజాగా తెలుగు ప్రేక్షకులందరికీ దగ్గరయ్యాడు రవితేజ.

ఆయన తర్వాత ఆయన సోదరులు ఇద్దరినీ సినీ రంగ ప్రవేశం చేయించినా వారిలో ఇద్దరూ సినీ రంగంలో నిలదొక్కుకోలేక పోయారు. వారిలో ఒకరు డ్రగ్స్ కి బానిసై రోడ్డు ప్రమాదంలో కూడా మృతి చెందారు. అయితే రవితేజ క్యారెక్టర్ మీద ఎలాంటి మరక ఇప్పటివరకు లేదు. కానీ ఇప్పుడు సంచనం రేపే విధంగా ఉమైర్ సంధు సౌత్ సూపర్ స్టార్ రవితేజతో పనిచేయడానికి చాలామంది యంగ్ హీరోయిన్లు ఐటెం గర్ల్స్ చాలా ఇబ్బందికరంగా ఫీల్ అవుతారని ఆరోపించాడు.

సాంగ్ షూటింగ్ సమయంలో ఆయన వారి శరీరాలను పట్టుకునే విధానం చాలా ఇబ్బందికరంగా ఉంటుందని వారు భావిస్తారని కామెంట్ చేశాడు. రవితేజ అనేక మంది కొత్త నటీమణులను ఇబ్బంది పెట్టాడు అంటూ రవితేజ గురించి సంచలన ఆరోపణలు చేశాడు దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడిని అక్కడి ఫిలిం క్రికెట్ గా వ్యవహరిస్తూ ఉంటానని చెప్పుకునే ఉమైర్ సంధు. అసలు ఈ ఉమైర్ సంధు నిజంగా ఉన్నాడా..? లేక ఇది ఒక కల్పిత సోషల్ మీడియా ఎకౌంటా..? అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ అతను కొద్ది రోజుల క్రితం మహేష్ బాబు గురించి కూడా ఇదే విధమైన ఆరోపణలు చేశాడు.

అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా ఇలాగే సంచలన ఆరోపణలు చేశాడు. ఇప్పుడు రవితేజను టార్గెట్ చేస్తూ ఆయన సంచలన ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ అవుతోంది. రవితేజ ధమాకా, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్నాడు. ఇప్పుడు రావణాసుర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ రావణాసుర సినిమాలో రవితేజ సరసన ఏకంగా ఐదుగురు హీరోయిన్లు నటిస్తూ ఉండడం గమనార్హం  సుధీర్ వర్మ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎందుకు సిద్ధమవుతోంది.

Also Read: Priya Vadlamani Photos: ప్యాంట్ మరచిపోయి ఫోటోలకు ఫోజులిచ్చిన తెలుగమ్మాయి ప్రియ వడ్లమాని.. ఇలా చూస్తే తట్టుకోలేరు!

Also Read: Jr NTR’s prediction: నిజమైన ఎన్టీఆర్ అంచనా..విషెస్ చెప్పిన నటుడికి ఆస్కార్ అవార్డు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News