Jr NTR’s prediction: నిజమైన ఎన్టీఆర్ అంచనా..విషెస్ చెప్పిన నటుడికి ఆస్కార్ అవార్డు!

Jr NTR’s prediction on Brendan Fraser: జూనియర్ ఎన్టీఆర్ ప్రీ ఆస్కార్ పార్టీ సందర్భంగా బ్రెండన్ ఫ్రేజర్‌ను వ్యక్తిగతంగా కలుసుకుని విషెస్ చెప్పడం, ఆయనకు అవార్డు రావడం చర్చనీయాంశం అయింది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Mar 13, 2023, 01:48 PM IST
Jr NTR’s prediction: నిజమైన ఎన్టీఆర్ అంచనా..విషెస్ చెప్పిన నటుడికి ఆస్కార్ అవార్డు!

Jr NTR’s prediction comes true on Brendan Fraser: జూనియర్ ఎన్టీఆర్ అంచనాలను నిజం చేస్తూ ఆస్కార్ అకాడమీ అవార్డ్స్‌లో బ్రెండన్ ఫ్రేజర్ అనే హాలీవుడ్ నటుడు ఉత్తమ నటుడి అవార్డు గెలుచుకున్నాడు. ఆయన నటించిన ది వీల్ సినిమా కోసం ఈ అవార్డును గెలుచుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అవార్డుల ప్రదానోత్సవానికి ముందు రోజు బ్రెండన్ ఫ్రేజర్ కు శుభాకాంక్షలు తెలిపారు. బ్రెండన్ ఫ్రేజర్ ఈ అవార్డును గెలుచుకోవడంతో జూనియర్ ఎన్టీఆర్ జోస్యం నిజమవుతోందని ఆయన అభిమానులు అంటున్నారు.

నిజానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రీ ఆస్కార్ పార్టీ సందర్భంగా బ్రెండన్ ఫ్రేజర్‌ను వ్యక్తిగతంగా కలుసుకున్నాడు, ఈ సంధర్భంగా ఆయనకు  శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే అప్పుడు ఫ్రేజర్‌తో తాను ఫోటోను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు. ఇక డారెన్ అరోనోఫ్స్కీ దర్శకత్వం వహించిన చిత్రం ది వేల్‌లో ఫ్రేజర్ స్థూలకాయంతో బాధ పదుహాతున్న ఒక ఉపాధ్యాయునిగా నటించాడు. ఆస్టిన్ బట్లర్, కోలిన్ ఫారెల్ సహా టామ్ క్రూజ్‌వంటి గొప్ప నటులను ఓడించడం ద్వారా ఫ్రేజర్ ఈ ఘనతను సాధించాడు.

90వ దశకంలో జార్జ్ ఆఫ్ ది జంగిల్, ది మమ్మీ చిత్రాలతో హాలీవుడ్ ప్రేక్షకుల అభిమానాన్ని పొందిన నటుడు బ్రెండన్ ఫ్రేజర్ రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రం ది వేల్. మదర్ సహా బ్లాక్ స్వాన్ వంటి చిత్రాలకు ప్రసిద్ధి చెందిన డారెన్ అరోనోఫ్స్కీ, బ్రెండన్‌ ఫ్రేజర్ కలిసి ఈ సినిమా చేశారు. స్థూలకాయం సమస్య కారణంగా జీవితం అంతా బోసిపోయినట్టు బాధ పడే ఓ వ్యక్తి తన పదిహేడేళ్ల కుమార్తెతో ప్రేమపూర్వక సంబంధాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించడమే ఈ సినిమా లైన్. నిజానికి ఈ సినిమా కథ బ్రెండన్ నిజ జీవితానికి సంబంధించి కూడా చాలా కనెక్ట్ అయింది. 2000 మధ్యలో హాలీవుడ్ నుంచి కనుమరుగైన బ్రెండన్ ఫ్రేజర్ కు సంబంధించిన అధిక బరువు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

ఈ సినిమాలో ఆయన 272 కేజీల మనిషిగా ఆయన నటించారు. స్ట్రేంజర్ థింగ్స్‌లో మాక్స్ పాత్రను పోషించిన సాడీ సింక్ ఈ సినిమాలో బ్రెండన్ కుమార్తెగా నటించింది. 1999లో విడుదలైన మమ్మీ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల అభిమానాన్ని చూరగొన్న బ్రెండన్  ఆ తర్వాత వచ్చిన రెండు మమ్మీ సిరీస్ చిత్రాలలో కూడా హీరోగా నటించాడు. అయితే హాలీవుడ్ నుండి బ్లాక్ లిస్ట్ చేయబడ్డారు ఎందుకంటే 2003లో తనపై వచ్చిన లైంగిక ఆరోపణలే ఇందుకు కారణమని బ్రెండన్ చెబుతుంటాడు. బ్రెండన్ చివరిగా 2013లో విడుదలైన బ్రేకౌట్ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించాడు. 

Also Read: Ram Charan at Oscars: పుట్టబోయే బిడ్డ అదృష్టంతో ఆస్కార్.. రామ్ చరణ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్! 

Also Read: Jr NTR with Tiger Suit: భుజాన టైగర్ బొమ్మతో ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్ సందడి..ఏకంగా యాంకర్ కే షాకిచ్చాడుగా!

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

 TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

 

Trending News