Vivek Oberoi: 'బాలీవుడ్‌లో ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం'..హీరో వివేక్ ఒబెరాయ్ షాకింగ్ కామెంట్స్

Vivek Oberoi: హిందీ చిత్రపరిశ్రమపై స్టార్ హీరో వివేక్ ఒబెరాయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. బాలీవుడ్ లో టాలెంట్ కంటే ఇంటిపేరుకే ప్రాధాన్యం ఎక్కువని ఆయన అన్నారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 7, 2021, 04:01 PM IST
Vivek Oberoi: 'బాలీవుడ్‌లో ప్రతిభ కంటే ఇంటి పేరుకే ప్రాధాన్యం'..హీరో వివేక్ ఒబెరాయ్ షాకింగ్ కామెంట్స్

Vivek Oberoi: వెబ్ సిరిస్ 'ఇన్‌సైడ్‌ ఎడ్జ్‌’' 3వ సీజన్‌(Inside Edge Season 3) అమెజాన్ ప్రైమ్(Amazon Prime) ఓటీటీ వేదికగా ఇటీవల రిలీజ్ అయ్యింది. వివేక్ ఒబెరాయ్, రీచాచద్దా, అంగద్‌ బేడీ, సిద్ధాంత్‌ చతుర్వేదీ కీలకపాత్రలు పోషించారు. ఇందులోని మొదటి రెండు సీజన్లు సూపర్‌ డూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.  తాజాగా మూడో సీజన్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. దీని ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వివేక్‌‘(Vivek Oberoi)..బాలీవుడ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

Also Read: Katrina Kaif Vicky Kaushal wedding : విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల పెళ్లికి వచ్చే వాళ్లు తక్కువే.. మొబైల్స్ వద్దన్నారంట

బాలీవుడ్(Bollywood)లో అడుగుపెట్టాలంటే..ప్రతిభ కంటే ఇంటిపేరే ముఖ్యమని వివేక్ వ్యాఖ్యానించారు. తాను 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న నేటికీ ఇబ్బందులు తప్పట్లేదని వాపోయారు. హిందీ చిత్ర పరిశ్రమ యవ ప్రతిభను పెంచి పోషించే ఒక వ్యవస్థను అభివృద్ధి చేయలేకపోయిందన్నారు. బాలీవుడ్‌లో అవకాశాలకు, ప్రతిభకు సంబంధం ఉండదని...ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వెలిబుచ్చారు. వీలైనంత ఎక్కువ మంది యువతను ఇండస్ట్రీలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తానని వివేక్ అన్నారు. ‘రక్త చరిత్ర(Rakta Charitra)’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు వివేక్‌ ఓబెరాయ్‌. ఆ తర్వాత రామ్‌చరణ్‌ హీరోగా నటించిన ‘'వినయ విధేయ రామ’'లో విలన్‌గా మెప్పించాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x