నాగార్జున, నానిలకు హీరోయిన్ ప్రాబ్లం !

నాగార్జున, నాని కాంబినేషన్‌లో రానున్న మల్టీస్టారర్ సినిమా ఈ ఉగాది రోజున లాంచ్ కానుంది.

Last Updated : Mar 15, 2018, 07:54 PM IST
నాగార్జున, నానిలకు హీరోయిన్ ప్రాబ్లం !

నాగార్జున, నాని కాంబినేషన్‌లో రానున్న మల్టీస్టారర్ సినిమా ఈ ఉగాది రోజున లాంచ్ కానుంది. ఇందుకోసం చిత్ర యూనిట్ చేసుకోవాల్సిన అన్ని ఏర్పాట్లు చకచకా చేసుకుంటోంది. అయితే, తాజాగా యూనిట్ వర్గాల ద్వారా అందుతోన్న సమాచారం ప్రకారం.. ఓ వైపు సినిమా మరో రెండు, మూడు రోజుల్లో సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నప్పటికీ.. మరోవైపు ఈ సినిమాకు హీరోయిన్స్ ఖరారు కాలేదట. గతంలో ఈ సినిమాలో నాగ్ సరసన శ్రియ, నాని సరసన రకుల్ ప్రీత్ సింగ్ పేర్లు ఖరారయ్యాయనే టాక్ వినిపించినప్పటికీ.. అందులో వాస్తవం లేదని యూనిట్ తేల్చేసింది. 

లేటెస్ట్ ఫిలింనగర్ అప్ డేట్స్ ప్రకారం ఈ మల్టీస్టారర్ సినిమా యూనిట్ ఓవైపు ఉగాది రోజు నుంచి ప్రారంభమయ్యే రెగ్యులర్ షూటింగ్ కోసం ఏర్పాట్లు చేసుకుంటూనే మరోవైపు నాగ్, నాని కోసం హీరోయిన్స్ వేట కొనసాగిస్తోందట. శ్రీనాథ్ ఆదిత్య డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అశ్వినిదత్ నిర్మించనున్నాడు. ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ కి తోడు మణిశర్మ మ్యూజిక్ కూడా ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్ కానుంది. 

Trending News