Konaseema Thugs first single ప్రస్తుతం రా అండ్ రస్టిక్ సినిమాలకు క్రేజ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ప్రముఖ డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ ఇప్పుడు దర్శకురాలిగా మారి కొత్త ప్రయోగం చేయబోతోన్నారు. ఆమె దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్‌లో థగ్స్ అనే చిత్రం తెరకెక్కుతోంది. తెలుగులో ఈ సినిమాను కోనసీమ థగ్స్ అనే పేరుతో రిలీజ్ చేయబోతోన్నారు. రా అండ్ రస్టిక్ యాక్షన్ ఫిల్మ్‌గా రాబోతోన్న కోనసీమ థగ్స్ సినిమాను నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ నిర్మిస్తున్నారు. ఆయన కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తుండగా.. జియో స్టూడియోస్‌తో కలిసి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ వంటివారు కీ రోల్స్ పోషించారు. ఈ మధ్యే విడుదల చేసిన థగ్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ వీడియో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఇక మూవీ ట్రైలర్‌ను విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్, ఆర్య, అనిరుధ్, కీర్తి సురేష్ వంటి వారు విడుదల చేయడంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
తాజాగా ఈ చిత్రానికి సంభందించిన మొదటి పాటను విడుదల చేశారు. అమ్మవారు కాళికా రూపంలో ఊరేగింపుగా వచ్చే సన్నివేశం బ్యాక్ డ్రాప్ లో ఈ పాటను రోమాంచితంగా చిత్రీకరించినట్టు కనిపిస్తోంది. 'వీర శూర మహంకాళి వస్తోందయ్యా... వేటాడను ఆ తల్లే వస్తొందయ్యా' అంటూ సాగే ఈ పాట చిత్రంలో కీలక సన్నివేశంలో రానుందని తెలుస్తోంది.
అమ్మవారు పూనినట్లుగా హృదు చేసిన నృత్యం, డాన్స్ కొరియోగ్రఫీ హైలెట్ అవుతున్నాయి. ఇక మ్యూజిక్ డైరెక్టర్ శామ్ సి ఎస్ అమ్మ ఉగ్ర రూపాన్ని ఎలివేట్ చేసే ఎనర్జిటిక్ ట్యూన్ ఇవ్వగా వనమాలి అద్భుతమైన లిరిక్స్ అందించారు. ఆస్కార్ అవార్డ్ నామినీ అయిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం నుండి నాటు నాటు పాటను ఆలపించిన కాలభైరవ తన గాత్రంతో పాటను మరింత రోమాంచితంగా ఆలపించారు.
Also Read: Sreeleela Latest Photos : శ్రీలీల.. పెడుతోంది గుండెల్లో గోల.. చూస్తే తట్టుకోలేరంతే
Also Read: SSMB 28 Look : మహేష్ బాబు లెటెస్ట్ లుక్.. మరింత తగ్గిపోయాడే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook