MAA Election Polling: మా ఎన్నికల్లో భారీగా పోలింగ్, నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

MAA Election Polling: ప్రతిష్టాత్మక మా ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ప్యానెల్ సభ్యుల విమర్శలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మా ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 10, 2021, 03:14 PM IST
MAA Election Polling: మా ఎన్నికల్లో భారీగా పోలింగ్, నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు

MAA Election Polling: ప్రతిష్టాత్మక మా ఎన్నికల పోలింగ్ రసవత్తరంగా కొనసాగుతోంది. ప్యానెల్ సభ్యుల విమర్శలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మా ఎన్నికలపై నటి పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు(MAA Elections)ఈసారి సమయం కంటే ఎక్కువసేపు నడుస్తున్నాయి. ఓటర్ల అభ్యర్ధన, ప్యానెల్ సభ్యుల అంగీకారం మేరకు సమయాన్ని మరో గంటసేపు పొడిగించారు ఎన్నికల అధికారులు. గతంలో ఎన్నడూ లేనివిధంగా పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్యానెల్ సభ్యులు ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. మరోవైపు అగ్రహీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలకృష్ణతో పాటు నాగార్జున తదితరులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వాస్తవానికి మద్యాహ్నం 2 గంటలకే ఓటింగ్ ముగియాల్సి ఉన్నా..చాలామంది ట్రాఫిక్‌లో చిక్కుకున్నట్టు సమాచారం ఇవ్వడంతో మరోగంటసేపు పోలింగ్ సమయాన్ని పొడిగించారు. ప్రకాశ్‌రాజ్, మంచు విష్ణులతో మాట్లాడి పోలింగ్ (MAA Elections Polling)సమయాన్ని పొడిగించే నిర్ణయం తీసుకున్నారు. ఈసారి మాత్రం రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదయ్యే పరిస్థితి కన్పిస్తోంది. 

మరోవైపు మా ఎన్నికలపై నటి పూనమ్ కౌర్(Poonam Kaur)సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో చాలా రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించింది. రాజకీయ లబ్ది కోసం ఆర్టిస్టుల్ని సతాయించడం మానుకోవాలని సూచించింది. ఏ ప్యానెల్ గెలిచినా..రాజకీయాలను, మా అసోసియేషన్‌ను కలపకూడదని తెలిపింది.

Also read: MAA Elections : నేను ఓటేసిన వారే గెలుస్తారు - బండ్ల గణేశ్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News