Hyper Aadi Anchor Varshini : యాంకర్ వర్షిణితో కోరిక తీర్చుకున్న హైపర్ ఆది.. మరీ అంత పిచ్చిదా?

Hyper Aadi Fun With Anchor Varshini హైపర్ ఆది బుల్లితెరపై వేసే పంచులు, చేసే చేష్టలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే. అయితే ఆ మధ్య ఆది, వర్షిణిల ప్రేమ కథలకు కుప్పలుతెప్పలుగా తెరపైకి వచ్చిన విషయం విదితమే

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 31, 2023, 07:43 PM IST
  • నెట్టింట్లో యాంకర్ వర్షిణి సందడి
  • స్టార్ మా షోలోకి హైపర్ ఆది
  • వర్షిణితో కోరిక తీర్చేసుకున్న ఆది
Hyper Aadi Anchor Varshini : యాంకర్ వర్షిణితో కోరిక తీర్చుకున్న హైపర్ ఆది.. మరీ అంత పిచ్చిదా?

Hyper Aadi Fun With Anchor Varshini హైపర్ ఆది వర్షిణి ట్రాక్‌ గురించి లెక్కలేనన్ని రూమర్లు వచ్చాయి. యూట్యూబ్ అయితే ఈ ఇద్దరికీ పెళ్లి చేసేసింది. వీరిద్దరి మీద రకరకాల థంబ్ నెయిల్స్ వస్తుండేవి. ఈ ఇద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతారంటూ రకరకాలుగా రూమర్లు వస్తుండేవి. అయితే ఆది, వర్షిణిలు ఢీ షో నుంచి విడిపోయాక.. ఈ రూమర్లకు పుల్ స్టాప్ పడ్డాయి. మళ్లీ ఇప్పుడు ఈ ఇద్దరూ చర్చల్లోకి వస్తున్నారు.

ఢీ షో చేసిన సమయంలో ఆది, వర్షిణిల ట్రాక్ మాత్రం ఎక్కువగా వైరల్ అయింది. రష్మీ సుధీర్ ట్రాక్ తరువాత మళ్లీ అంతగా వార్తల్లోకి వచ్చింది వర్షిణి ఆది ట్రాకే. ఈ జోడికి అంతా ఫిదా అయ్యారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్‌లోనూ ఈ ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా ఉంటారు. మొదట్లో కాస్త దూరంగా ఉండేవారు. కానీ ఢీ షో ఎపిసోడ్‌లు ముందుకు వెళ్తున్న కొద్దీ క్లోజ్‌గా అయ్యారు. ఢీ షోలో మొదట్లో వర్షిణికి స్టెప్పులు వేయడం కూడా రాదు. కానీ చివరకు ఏదో అలా కొద్దిగా మూమెంట్స్ నేర్చుకుంది.

బుల్లితెరపై కొన్ని రోజులు అయితే ఆది, వర్షిణిల హవా నడించింది. ఈ ఇద్దరినీ ఆలీతో సరదాగా షోలో ఆలీ సైతం ఎన్నో పర్సనల్ ప్రశ్నలు కూడా అడిగాడు. తామిద్దరం మంచి స్నేహితులమేనని, అంతకు మించి ఏమీ లేదని క్లారిటీ ఇచ్చారు. అయితే ఆది, వర్షిణిలు మాత్రం బుల్లితెరపై రెచ్చిపోతూ ఉంటారు. తాజాగా ఓంకార్ సిక్స్త్ సెన్స్ షోకు గెస్టులుగా వచ్చారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News