Independence Day Movies 2024: స్వాతంత్ర దినోత్సవం, రాఖీ సందర్భంగా.. ఈసారి చాలా లాంగ్ వీకెండ్ వచ్చింది. దీంతో సినీ ప్రియుల కోసం థియేటర్లలో సినిమాల సందడి మొదలైంది. ఈసారి తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు డబ్బింగ్ సినిమాలు కూడా పోటీకి దిగుతున్నాయి. రవితేజ మిస్టర్ బచ్చన్, రామ్ పోతినేని డబల్ ఇస్మార్ట్.. వంటి సినిమాలతో పాటు విక్రమ్ తంగలన్.. కూడా ఈరోజు విడుదలైంది.
ఇక బాలీవుడ్లో ఖేల్ ఖేల్ మే, వేదా, స్త్రీ 2 సినిమాలు పోటీ పడుతున్నాయి. వీటిలో స్త్రీ..మూవీకి సీక్వల్ గా విడుదలవుతున్న స్త్రీ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. హారర్ కామెడీస్ జోనర్ లో వచ్చిన స్త్రీ చిత్రం.. అప్పట్లో మంచి వసూలు రాబట్టింది. మరి రెండో భాగం ఏ స్థాయి కలెక్షన్స్ అందుకుంటుందో తెలియాలి అంటే.. ఈ వీకెండ్ వరకు వేచి చూడాలి.
ఆ సంగతి పక్కన పెడితే ప్రస్తుతానికి బుక్ మై షో లో.. మాత్రం ఈ చిత్రం రికార్డు సృష్టిస్తోంది. బుక్ మై షో యాప్ లో ఈ మూవీ 24 గంటల్లో 22 వేల టికెట్లు విక్రయించి ఈ వారం విడుదలైన సినిమాలలో అగ్రస్థానంలో ఉంది. ఇదివరకే మూవీ ఫ్రీక్వల్ హిట్ కావడం.. పైగా ఇప్పుడు హారర్ కామెడీ బాగా ట్రెండింగ్ గా ఉండడం.. లాంటి అంశాల కారణంగా ఈ మూవీ స్టార్ హీరోల సినిమాలు అన్నిటికన్నా కూడా.. ఇండిపెండెన్స్ డే రోజు ఎక్కువ టికెట్లు వసూలు చేసిన చిత్రంగా మిగిలింది.
మిస్టర్ బచ్చన్ , డబల్ ఇస్మార్ట్ చిత్రల పై అంచనాలు భారీగా ఉన్నాయి. వరుస డిజాస్టర్స్ తో బాధపడుతున్న రవితేజకు ఈ మూవీ సక్సెస్ కావడం.. ఎంతో అవసరం. డబల్ ఇస్మార్ట్ సక్సెస్ పూరి జగన్నాథ్ తో పాటు రామ్ కెరీర్ కి కూడా ఎంతో ముఖ్యం. కానీ ఈ రెండు సినిమాలు కూడా.. విడుదలైన మొదటి షో నుంచే మిశ్రమ స్పందన తెచ్చుకుంటున్నాయి. మరి ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు నిలబడతాయో చూడాలి. వీటిలో ఏ ఒక్క చిత్రం తడబడినా.. ఆ ప్లేస్‌ని తంగలన్ లేదా స్త్రీ చిత్రాలు ఆక్రమించే అవకాశం ఉంది.
Also Read: ఒకే రోజు విడుదలైన చిరు, కమల్ హాసన్ సినిమాలు.. దర్శకుడు కూడా ఒకడే..
Also Read: ఒకే టైటిల్ తో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ చిరు చేసిన ఈ సినిమాలు తెలుసా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter