Jabardasth Nookaraju : నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ఎదురుదెబ్బ.. జబర్దస్త్ స్టేజ్ మీదే తల్లిదండ్రుల నిరాకరణ

Jabardasth Nookaraju Parents పటాస్ షోతో నూకరాజు, ఆసియాలు ఫేమస్ అయ్యారు. అప్పటి నుంచే ఈ ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ మొదలైంది. కానీ వీరి ఎప్పుడూ కూడా ఆన్ స్క్రీన్ మీద వారి ప్రేమ కథను వాడుకోలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 16, 2023, 03:47 PM IST
  • బుల్లితెరపై నూకరాజు ఆసియా ప్రేమ కహాని
  • జబర్దస్త్ ప్రోమోలో నూకరాజు పేరెంట్స్ షాక్
  • ఆసియాతో పెళ్లికి ఒప్పుకోని తల్లిదండ్రులు
Jabardasth Nookaraju : నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ఎదురుదెబ్బ.. జబర్దస్త్ స్టేజ్ మీదే తల్లిదండ్రుల నిరాకరణ

Jabardasth Nookaraju asia love పటాస్ షోతో నూకరాజు తెరపైకి వచ్చాడు. పటాస్ షోతో యాంకర్ రవి, శ్రీముఖి, సద్దాం, నూకరాజు, ఫైమా వంటి వారెంతో మంది ఫేమస్ అయ్యారు. ఇక పటాస్ షోను ఆపేయడంతో చాలా మంది జబర్దస్త్ షోకి వచ్చారు. కొంత మంది ఇతర చానెళ్లకు వెళ్లారు. నూకరాజు మాత్రం ముందు నుంచి మల్లెమాలతోనే ఉన్నాడు. ఇప్పుడు జబర్దస్త్ షోలో టీం లీడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఆది వెళ్లిపోవడంతో ఇప్పుడు కొత్త టీంలను ఏర్పాటు చేయాల్సి వచ్చింది.

ఇప్పుడు జబర్దస్త్ షోలో నూకరాజు టీం లీడర్‌గా అదరగొట్టేస్తున్నాడు. తన ప్రేయసి ఆసియాతో కలిసి స్కిట్లు చేస్తున్నాడు. ఈ ఇద్దరి లవ్ ట్రాక్ ఇప్పుడు జబర్దస్త్ స్టేజ్ మీద బాగానే నడుస్తోంది. ఇన్ని రోజులు సోషల్ మీడియాలోనే ఈ ఇద్దరూ కలిసి సందడి చేసేవారు. కానీ ఇప్పుడు స్కిట్లతోనూ ఆకట్టుకుంటున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో నూకరాజు, ఆసియాలకు ఎదురుదెబ్బ తగిలినట్టు అయింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News