జెర్సీ హిందీ మూవీ ట్రైలర్ లాంచింగ్‌కి ముహూర్తం ఖరారు

తెలుగులో హిట్ అయిన జెర్సీ సినిమా ప్రస్తుతం షాహీద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతోంది. జెర్సీ పేరిటే రీమేక్ అవుతున్న ఈ సినిమాలో షాహీద్ కపూర్ సరసన మృనాల్ థాకూర్ జంటగా నటిస్తోంది. హింది వెర్షన్ కూడా గౌతం తిన్ననూరినే డైరెక్ట్ చేస్తున్నాడు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 23, 2021, 12:13 AM IST
  • న్యాచురల్ స్టార్ నాని హీరోగా తెలుగులో వచ్చిన జెర్సీ మూవీ
  • హిందీలో షాహీద్ కపూర్ హీరోగా జెర్సీ రీమేక్
  • జెర్సీ రీమేక్ ట్రైలర్ లేటెస్ట్ అప్‌డేట్స్
జెర్సీ హిందీ మూవీ ట్రైలర్ లాంచింగ్‌కి ముహూర్తం ఖరారు

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ఎమోషనల్ డ్రామా జెర్సీ మూవీ తెలుగులో సూపర్ హిట్ అయింది. నాని కెరీర్లో సినీ విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రంగా జెర్సీ రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాలో నాని ఒక క్రికెటర్ పాత్రలో నటించాడు. గౌతం తిన్ననూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను పిడివి ప్రసాద్, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మించారు. నాని సరసన శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించగా అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. 

తెలుగులో హిట్ అయిన జెర్సీ మూవీ ప్రస్తుతం షాహీద్ కపూర్ హీరోగా హిందీలో రీమేక్ అవుతోంది. జెర్సీ పేరిటే రీమేక్ అవుతున్న ఈ సినిమాలో షాహీద్ కపూర్ సరసన మృనాల్ థాకూర్ జంటగా నటిస్తోంది. హింది వెర్షన్ కూడా గౌతం తిన్ననూరినే డైరెక్ట్ చేస్తున్నాడు. 

Also read : తనయుడు భార్గవ్ రామ్‌తో తారక్.. వైరల్ అవుతున్న లవ్లీ ఫోటో

జెర్సీ హిందీ వెర్షన్ ప్రత్యేకత ఏంటంటే.. హిందీ నిర్మాతల ప్రమేయం లేకుండా అల్లు అరవింద్, నాగ వంశీ, బన్నీ వాసు, దిల్ రాజు కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. మంగళవారం జెర్సీ హిందీ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ తెలిపారు. 

మంగళవారం సాయంత్రం 5.30 గంటలకు జెర్సీ ట్రైలర్ లాంచ్ కానుంది. తెలుగులో న్యాచురల్ స్టార్ నాని మెప్పించిన విధంగానే షాహీద్ కపూర్ కూడా మెప్పిస్తాడా లేదా అనేది కొంతమేరకు రేపు ట్రైలర్ చూస్తే తెలియనుండగా.. సినిమా మొత్తం చూడాలంటే డిసెంబర్ 31 వరకు వేచిచూడాల్సిందే.

Also read : ఆర్ఆర్ఆర్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదేనా ?

Also read : శ్యామ్ సింగ రాయ్ హిందీ డబ్బింగ్ రైట్స్‌కి భారీ ధర

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News